E-Paper
Advertisement

విమాన ప్రమాదం నుంచి బయట పడి డైరెక్ట్ నరకంలోకి… ప్రతి ఒక్కరూ చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్

విమాన ప్రమాదం నుంచి బయట పడి డైరెక్ట్ నరకంలోకి… ప్రతి ఒక్కరూ చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Thriller : ఒక యువకుడు చిన్నప్పుడు జర్మనీలో ఇంటిపై నుంచి అమెరికన్ ఫైటర్ ప్లేన్‌ను చూసి, “నేను కూడా ఎగరాలి” అని నిర్ణయించుకుంటాడు. ఆ కలను సాకారం చేసుకోవడానికి అమెరికా వెళ్తాడు. నేవీలో పైలట్ కూడా అవుతాడు. కానీ ఆ కలే అతన్ని నరకంలోకి తోసేస్తుంది. ఇది ఈరోజు మన మూవీ సజెషన్ లో చెప్పుకోబోయే అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్. మరి ఈ మూవీ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

స్టోరీలోకి వెళ్తే…

1966 ఫిబ్రవరి. వియత్నాం యుద్ధం మొదలైన కొత్తలో స్టోరీ నడుస్తుంది. అమెరికన్ నేవీ పైలట్ డైటర్ డెంగ్లర్ తన మొదటి మిషన్‌కు వెళ్తాడు. USS Ranger అనే యుద్ధ నౌక నుంచి టేకాఫ్ చేసి, లావోస్ పైన సీక్రెట్ బాంబింగ్ మిషన్‌ లో ఉంటాడు. కానీ అతని Douglas A-1 Skyraider ప్లేన్ శత్రువుల కాల్పులకు గురై, జంగిల్‌ లో క్రాష్ అవుతుంది. డైటర్ ఏమాత్రం భయపడకుండా, సర్వైవ్ అయి బయటపడతాడు. కానీ కొద్ది సేపటికే వియత్ కాంగ్‌కు సపోర్ట్ చేసే లావోస్ గ్రూప్ సైనికులు అతన్ని పట్టుకుంటారు.

Advertisement

మొదట అతన్ని గ్రామస్తులు చుట్టుముట్టి, తర్వాత బంధించి తీసుకెళ్తారు.శత్రువులు అతన్ని ఒక ప్రావిన్స్ గవర్నర్ ముందు నిలబెడతారు. “అమెరికాను ఖండించే లేఖపై సంతకం చేస్తే వదిలేస్తాం” అంటారు. డైటర్ నిరాకరిస్తాడు. అక్కడ నుంచి అతనికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. చేతుల్లో పొడిచి, తలక్రిందులుగా వేలాడదీసి ఉంచడం, చీమలతో కుట్టించడం, నీటిలో ముంచడం… ఇలా ఎన్నో చిత్రహింసలు పెడతారు. తర్వాత అతన్ని ఒక మారుమూల జంగిల్ క్యాంప్‌ కు తీసుకెళ్తారు. అక్కడ అతనికి ఇతర ఖైదీలు కన్పిస్తారు.

ఆ క్యాంప్ చాలా దారుణంగా ఉంటుంది. బాంబు కట్టడాలు, తినడానికి కొద్దిపాటి అన్నం, కొన్ని ఆకులు, భయంకరమైన వ్యాధులు, గార్డుల హింస ఇలా బతుకు మీద విరక్తి పుట్టేలా ఉంటుంది. కానీ డైటర్ మాత్రం అక్కడి నుంచి బతికి బయట పడతాను అనే ఆశను వదలడు. పైగా ఎస్కేప్ ప్లాన్ వేస్తాడు. ముందుగా అతన్ని మిగతా ఖైదీలు నమ్మరు. కానీ నెమ్మదిగా అందరిలో ధైర్యాన్ని కూడగట్టి ప్లాన్ ను అమలు చేస్తారు. మరి ఎస్కేప్ అవ్వడానికి హీరో వేసిన ప్లాన్ ఏంటి ? అనుకున్నట్టుగా అక్కడి నుంచి హీరో తప్పించుకున్నాడా ? అనేది తెరపై చూసి తెలుసుకోవలసిన అంశం.

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

Advertisement

ఇది కేవలం వార్ డ్రామా కాదు… మనిషి ఇచ్ఛాశక్తి, సర్వైవల్ ఇన్‌స్టింక్ట్, ఆశ గురించిన అద్భుతమైన కథ. Werner Herzog డైరెక్షన్‌తో, Christian Bale బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో ఈ సినిమా చాలా రాగా, ఇంటెన్స్‌గా ఉంటుంది. ఈ మూవీని యూట్యూబ్ లోనే చూడవచ్చు.

Read Also : బార్‌లో మద్యం తాగుతూ భార్యలు చేసే రచ్చ… ఏ ఓటీటీలో ఉందంటే ?

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×