BigTV English

Notice to Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్… ఆ పబ్‌కు నోటీసులు.?

Notice to Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్… ఆ పబ్‌కు నోటీసులు.?

Notice to Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది. బెంగళూరులో విరాట్ కోహ్లీకి “వన్8 కమ్యూన్” అనే పబ్ ఉంది. అయితే ఈ పబ్ లో సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించారంటూ బెంగుళూరు బృహత్ మహానగర పాలక ( బీబీఎంపీ) నోటీసులు జారీ చేసింది. బెంగళూరు నగరంలోని చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సమీపంలో ఉన్న ఎంజీ రోడ్డు లోని రత్నం కాంప్లెక్స్ లో ఈ పబ్ ఉంది. పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలక అధికారులు గుర్తించారు.


Also Read: KL Rahul Injured: టీమిండియాకు బిగ్ షాక్… నాలుగో టెస్ట్ కు ఆ ప్లేయర్ దూరం !

దీంతో ఈ పబ్ కి నోటీసులు జారీ చేశారు. అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండా నిర్వహిస్తున్నారని (బిబిఎంపీ) పేర్కొంది. సామాజిక కార్యకర్తలు హెచ్ఎం వెంకటేష్, కుణిగల్ నరసింహమూర్తి అనే ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో బీబీఎంపీ ఈ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులు నవంబర్ 29 న జారీ చేయగా.. ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశామని, ఏడు రోజుల్లోగా సమాధానం రాకపోతే పబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బిబిఎంపీకి చెందిన శాంతినగర్ డివిజన్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.


బెంగళూరులో చాలా ఎత్తయిన భవనాలలో ఎన్నో రెస్టారెంట్లు, బార్లు, పబ్ లు ఎటువంటి అగ్నిమాపక భద్రతా చర్యలు లేకుండా పనిచేస్తున్నాయని సోషల్ వర్కర్ వెంకటేష్ తెలిపారు. ఇలాంటి ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగితే భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గతంలోనూ ఈ పబ్ పై ఓ కేసు నమోదయింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా ఈ పబ్ ని నిర్వహిస్తున్నందుకు ఈ ఏడాది జూలైలో ఈ పబ్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది. జులై 7 న పక్కా సమాచారంతో పిఎస్ఐ అశోక్ ఠాకూర్ నేతృత్వంలోని పోలీస్ బృందం శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు ఎంజీ రోడ్డు సమీపంలోని కస్తూర్బా రోడ్డులోని రత్నం కాంప్లెక్స్ భవనం వద్ద ఉన్న (వన్ 8) కమ్యూన్ పబ్ పై దాడి చేశారు.

అర్ధరాత్రి రెండు గంటల వరకు పబ్ ని నడుపుతుండడంతో పబ్ మేనేజర్ పై కర్ణాటక పోలీసు చట్టం 1963 కింద కేసు నమోదు చేశారు. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, పూనే, కోల్కతాలో కూడా ఈ (వన్ 8) కమ్యూన్ బ్రాంచ్ లు ఉన్నాయి. బెంగళూరులోని పబ్ ని గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభించినట్లు సమాచారం. ఇక ఆరవ అంతస్తులో ఉన్న బెంగళూరులోని ఈ పబ్ లో నుంచి కబ్బన్ పార్క్ అందాలను చూస్తూ ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: Mohammed Siraj: సిరాజ్ అరుదైన రికార్డు.. పవర్ ప్లే లో అసలు సిసలు మొనగాడు!

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మొదటి నుంచి ఆడుతున్న కోహ్లీకి ఆ సిటీతో ఎంతో అనుబంధం ఉంది. అయితే ఈ పబ్ మాత్రమే కాకుండా ముంబై లోని కోహ్లీకి చెందిన రెస్టారెంట్ కూడా గతేడాది వివాదాల్లో చిక్కుకుంది. పంచెతో వెళ్లిన ఓ వ్యక్తిని (వన్ 8) కమ్యూన్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. పంచెతో వచ్చినందువల్ల అతన్ని బయటికి పంపించేశారు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇక ఇప్పుడు బెంగళూరులోని విరాట్ కోహ్లీకి చెందిన పబ్ ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించకపోవడం వల్ల మరోసారి వార్తల్లో నిలిచింది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×