Nagababu: మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడిగా నాగబాబు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. చిరు.. మొదట నాగబాబును కూడా హీరోగా మారుద్దామని ప్రయత్నించాడు.. కానీ, ఆయన బ్యాడ్ లక్ హీరోగా మారలేకపోయాడు. దీంతో నాగబాబు నిర్మాతగా మారాడు. విజయాపజయాలను పక్కన పెట్టి తనకు నచ్చిన సినిమాను నిర్మిస్తూ.. అప్పుడప్పుడు నటుడిగా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నాగబాబు సోషల్ మీడియా లో యమా యాక్టివ్ గా ఉంటాడు. ముఖ్యంగా తన అన్న చిరంజీవిని కానీ, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కానీ ఎవరైనా విమర్శిస్తే వారి అంతు చూసేవరకు వదలడు. అది ఎంతటి వారైనా సరే.. అవలీలగా మాటలు అనేయగలడు. అలా అనే ఎన్నో వివాదాలను కొనితెచ్చుకున్నాడు. చివరికి అల్లు అర్జున్ ను కూడా వదలలేదు.
UI Movie OTT : ఉప్పి హిట్ మూవీకి ఓటిటి కష్టాలు… ‘యూఐ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జనసేన ఎలక్షన్స్ సమయంలో పవన్ కోసం అల్లు అర్జున్ రాకుండా వైసీపీ నేతకు సపోర్ట్ చేసినప్పుడు.. సొంత మేనల్లుడు అని కూడా చూడకుండా “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు.. మా వాడైనా పరాయివాడే – మాతో నిలబడే వాడు.. పరాయివాడైనా మాడే” అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేశాడు. ఆ తరువాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు.
ఇక జనసేన కోసం నాగబాబు చాలా కష్టపడ్డాడు. ఎక్కడకు వెళ్లినా తమ్ముడు పవన్ వెంటనే నిలబడ్డాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా.. ఎన్ని విమర్శలు అందుకున్నా కూడా నాగబాబు తట్టుకొని నిలబడి .. తమ్ముడిని దగ్గర ఉండి గెలిపించాడు.ఇక జనసేన గెలిచాకా.. తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించే సమయంలో నాగబాబు ఆనందం చూడాలి. అంతలా ఆయన తన తమ్ముడు గెలుపును కోరుకున్నాడు. ఆ కష్టాన్నికి ప్రతిఫలంగా జనసేనలో మంత్రి పదవిని అందించబోతున్నారు. త్వరలోనే ఏ శాఖ ఇవ్వనున్నారో తెలియనుంది.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. నాగబాబు సైతం జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. ” మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరిలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. ఇలాగే అంటే.. పదవి లేకుండా కలకాలం ఉండమనా.. ? లేక ఎమ్మెల్యేగా ఉండమనా.. ? అని కొందరు.. విష్ చేశాడా.. ? కౌంటర్ వేశాడా.. ? అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు,
మీరిలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను….— Naga Babu Konidela (@NagaBabuOffl) December 21, 2024