KL Rahul Injured: ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐదు టెస్టులలో ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ ట్రోఫీలోని మొదటి టెస్ట్ లోనే టీమ్ ఇండియాకు అదిరే ఆరంభం దక్కింది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా పై భారత జట్టు 295 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య చేదనలో ఆసీస్ తన రెండవ ఇన్నింగ్స్ లో 238 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.
Also Read: Mohammed Siraj: సిరాజ్ అరుదైన రికార్డు.. పవర్ ప్లే లో అసలు సిసలు మొనగాడు!
ఇక ఆడిలైట్ వేదికగా జరిగిన రెండవ టెస్టులో భారత జట్టు స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 180 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో సైతం 175 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక 18 పరుగుల స్వల్ప లీడ్ అధిగమించేందుకు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ 1- 1 తో సమానమైంది. ఇక బ్రిస్ బెన్ వేదికగా గబ్బాలో జరిగిన మూడవ టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగిసింది.
దీంతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 1-1 తో సమానంగా నిలిచాయి. ఇక నాలుగోవ టెస్టు కోసం శుక్రవారం టీమిండియా మెల్ బోర్న్ చేరుకుంది. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ లో ఆదిక్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది భారత జట్టు. డిసెంబర్ 26 నుంచి మేల్ బోర్న్ లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాలుగో మ్యాచ్ జరగబోతోంది. ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ ( బాక్సింగ్ డే) కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్ కి సంబంధించిన మొదటిరోజు టికెట్లు అన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి.
అయితే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. డిసెంబర్ 21, 22, 24 తేదీలలో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భారత జట్టు ప్రాక్టీస్ చేస్తోంది అయితే తొలి రోజు ప్రాక్టీస్ లోనే భారత జుట్టుకి షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఒపెనర్ కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. కేఎల్ రాహుల్ కుడి చేతికి గాయమైనట్లుగా సమాచారం.
Also Read: U19 Women’s Asia Cup: ఫైనల్‌కు చేరిన టీమిండియా
కానీ రాహుల్ గాయం పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ రాహుల్ కి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే. కేఎల్ రాహుల్ ఒక్కడే ఈ సిరీస్ లో జట్టు తరుపున నిలకడగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లోని 6 ఇన్నింగ్స్ లో 294 పరుగులు చేశాడు. అంతే కాదు భారత్ తరపున ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఒకవేళ ఈ గాయం కారణంగా రాహుల్ నాలుగో టెస్ట్ కి దూరమైతే భారత జట్టుకి ఇబ్బందులు తప్పవు.