E-Paper
Advertisement

T20 World Cup 2026: ఇండియాకు బంగ్లాదేశ్‌ మ‌రో షాక్‌..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి అంపైర్లు ఔట్ ?

T20 World Cup 2026: ఇండియాకు బంగ్లాదేశ్‌ మ‌రో షాక్‌..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి అంపైర్లు ఔట్ ?
Advertisement

T20 World Cup 2026:  ఇండియా, బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు రోజుకు దిగజారి పోతున్నాయి. హిందువులపై బంగ్లాదేశ్ ముస్లింలు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమాయక హిందువులు కూడా మరణించారు. దీంతో బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ప్లేయర్లు ఐపిఎల్ లో ఆడకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కౌంటర్ గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంతొండి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వేదికలు మార్చాలని రెండు రోజుల నుంచి డిమాండ్ పెట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026) బంగ్లాదేశ్ కు చెందిన అంపైర్లు ( Bangladeshi umpires ) పాల్గొనబోరని వెల్లడించింది. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

టి20 ప్రపంచ కప్ 2026 నుంచి తప్పుకున్న అంపైర్లు ( Bangladeshi umpires) ?

Advertisement

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన అంపైర్లు , టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026) పాల్గొనడం లేదని వెల్లడించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. తమకు అనుకూలంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ వేదికలు మార్చితేనే వాళ్లు పాల్గొంటారని వెల్లడించింది. అలా కాదని తమ అంపైర్లను ఇండియాకు పంపిస్తే వాళ్లపై దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు స్పష్టం చేసింది. అందుకే ఇండియాలో అంపైర్లు కూడా పర్యటించబోరని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. శ్రీలంకలో జరిగే మ్యాచ్ ల‌కు మాత్రమే తమ అంపైర్లు వస్తారని వివరించింది. అదే సమయంలో వేదికలను తమకు అనుకూలంగా మార్చాలని ఐసిసికి రిక్వెస్ట్ పెట్టింది. కానీ బంగ్లాదేశ్ కు చెందిన SIS సైకత్ మాత్రం ఇండియాలో ప‌ర్య‌టిస్తార‌ట‌. ఎందుకంటే SIS సైకత్ బాధ్య‌త మొత్తం ఐసీసీదే. ఈ రూల్ మొద‌టి నుంచే ఉంది. కాబ‌ట్టి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో SIS సైకత్ పాల్గొంటారు.

ఐపీఎల్ 2026 పై బ్యాన్ వేసిన బంగ్లాదేశ్ స‌ర్కార్‌

ముస్తాఫిజుర్ రహమాన్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి వేటు వేసిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ లో ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన ప్రసారాలు రాకుండా ఆదేశాలు జారీ చేసింది. ప్రసారాలు మొత్తం నిలిపి వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత క్రికెట్ నియంత్రణ మండలికి భారీ షాక్ తగిలే ప్రమాదం ఉంది. కోట్లలో నష్టం కూడా రానుందట. దాదాపు పదివేల కోట్ల నష్టం బిసిసిఐకి వాటిల్లుతుందని చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ లో చాలామంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చూస్తారట. ఆ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రసారాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×