BCCI – IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా ? అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ పూర్తి కాగానే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కూడా ప్రారంభమవుతుంది. మార్చి 22వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పైన భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో కొత్త రూల్స్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మొన్నటి నుంచి టీమిండియా పై భారత క్రికెట్ నియంత్రణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Also Read: SA VS NZ: నేడు రెండో సెమీస్ కు వర్షం ఎఫెక్ట్…టైమింగ్స్, ఉచితంగా లైవ్ ఎలా చూడాలి !
ఇక ఇప్పుడు ఐపీఎల్ ప్లేయర్ లపై కూడా…. అవే ఆంక్షలు కొనసాగబోతున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఐపిఎల్ టోర్నమెంట్ పైన కఠిన నిబంధనలు తీసుకువస్తుంది బీసీసీఐ. ప్లేయర్లు, స్టాఫ్ కుటుంబ సభ్యులను డ్రెస్సింగ్ రూమ్ లోకి అనుమతించేది లేదని… తాజాగా సంచలన ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). ప్లేయర్లు మ్యాచులు, ప్రాక్టీస్ సెషన్లకు జట్టు బస్సులోనే ప్రయాణించాలని.. టీమిండియా కు పెట్టిన రూల్స్ ఇప్పుడు ఐపీఎల్ జట్లకు ( IPL 2025 Rules )కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అవార్డు ప్రధాన కార్యక్రమాలలో…. లీవ్ లెస్ జెర్సీలు అస్సలు ధరించకూడదని హెచ్చరికలు జారీ చేసింది. పైన చెప్పిన రూల్స్ ఏ ప్లేయర్ పాటించకపోయినా… మొదట వార్నింగ్ ఇస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది.
Also Read: IND VS AUS: దెబ్బకు దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరిన టీమిండియా
మళ్లీ రిపీట్ చేస్తే వాళ్లపై ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించింది. కాబట్టి కొత్త రూల్స్ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ప్లేయర్లు ఆట కొనసాగించాలని హెచ్చరికలు జారీ చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్స్ నేపథ్యంలో… ఐపీఎల్ ఆడే ప్లేయర్లు సన్నద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇది ఇలా ఉండగా… చాంపియస్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా…. మంగళవారం తొలి సెమీఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగింది. ఇందులో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచిన టీమిండియా నేరుగా ఫైనల్ కి వెళ్ళింది. ఇక ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య… రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఇందులో గెలిచిన జట్టు టీమ్ ఇండియాతో ఫైనల్ మ్యాచ్ దుబాయిలో ఆడుతుంది.