E-Paper
Advertisement

Rohit Sharma: గిల్ పై వేటు…దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ ?

Rohit Sharma: గిల్ పై వేటు…దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ ?
Advertisement

Rohit Sharma: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. త్వరలో వన్డే సిరీస్ కూడా జరగనుంది. నవంబర్ 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ జరుగుతుంది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో మరోసారి గిల్ స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారని చర్చ జరుగుతోంది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఎందుకంటే?

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్టు పూర్తయింది. నవంబర్ 14వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ మూడు రోజులలోనే ఫినిష్ అయింది. అయితే ఈ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో బౌండరీ సాధించిన గిల్, గాయం బారిన పడ్డాడు. అతని మెడ పట్టేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దాదాపు మూడు రోజులపాటు ఐసీయూలో చికిత్స పొందాడు గిల్. ఇక తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, హోటల్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు గిల్‌. అతని వాడకం చూస్తుంటే రెండో టెస్ట్ తో పాటు 3 వన్డేల సిరీస్ కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి డిసైడ్ అయిందట.

ఇప్పటికే వన్డే వైస్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో కోలుకుంటున్నాడు. ఇటు గిల్ ఇప్పటికే గాయంతో బాధపడుతున్నాడు. ఇక జట్టులో ఉన్నది రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు సీనియర్లే. వన్డే సిరీస్ లో బుమ్రాను తీసుకునేది డౌట్ అని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు చర్చలు జరుపుతున్నారట. మన ఆస్ట్రేలియా గడ్డపై కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు రోహిత్ శర్మ. సీనియర్ కెప్టెన్ గా అతనికి మంచి అనుభవం ఉంది. అందుకే 3 వన్డేలను డీల్ చేసేందుకు ఆఫర్ ఇవ్వబోతున్నారట. మరి దీనికి రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా ? నో చెబుతాడా ? అనేది తెలియాల్సి ఉంది.

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st ODI ) మధ్య 3 వన్డేల సిరీస్ నవంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మొట్ట మొదటి వన్డే రాంచి ( JSCA International Stadium Complex, Ranchi ) వేదికగా జరగనుంది. డిసెంబర్ మూడవ తేదీన రాయపూర్ వేదికగా రెండవ వన్డే మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక మూడవ వన్డే డిసెంబర్ 6వ తేదీన విశాఖపట్నం లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×