పెళ్లిలో కొత్త జంటను ఆటపట్టించడం మిత్రులకు అలవాటే. తాజాగా అలాంటి పనే చేశారు కొంత మంది పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. పెళ్లి పందిరిలో ఓ కొత్త ప్లాస్టిక్ డ్రమ్మును తీసుకొచ్చి గిఫ్టుగా ఇచ్చారు. ఈ గిఫ్ట్ చూసి అబ్బాయి షాక్ కాగా, అమ్మాయి నవ్వుతూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలియని వాళ్లు ఇదేం గిఫ్టుగా అని ఆలోచిస్తుండగా, విషయం తెలిసిన కొంత మంది పెళ్లి కొడుకును అలా భయపెట్టడం ఎంత వరకు కరెక్ట్ బ్రదర్స్? అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
కొద్ది వారాల క్రితం మీరట్ లో జరిగిన మర్చంట్ నేవీ అధికారికి సౌరభ్ రాజ్ పుత్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే, మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. ప్రియుడి సాయంతో ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్ తో సీల్ చేసింది. సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్ 2016లో ఒకరినొకరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నేవీలో అధికారిగా పని చేశాడు. వీళ్లకు 2019లో కూతురు పుట్టింది. ఆ తర్వాత సాహిల్ అనే వ్యక్తితో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి సౌరభ్ భార్య నుంచి విడాకులు తీసుకోవాలి అనుకున్నారు. కానీ, కుమార్తె భవిష్యత్ కోసం సౌరభ్ వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఫారిన్ కు వెళ్లాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూతురు పుట్టిన రోజు కోసం తిరిగొచ్చాడు. భర్త ఇండియాకు రావడం అస్సలు నచ్చని ముస్కాన్ అతడిని చంపేందుకు ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో వేసింది. ఆ తర్వాత సిమెంట్ తో ఆడ్రమ్మును నింపింది. సౌరభ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముస్కాన్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగింది.
Happy marriage life 💀☠️ pic.twitter.com/DfFH3Nd9uP
— ❥🅰 (@_anku__04) April 20, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రమ్ గిఫ్ట్
ఇక తాజాగా ఓ పెళ్లిలో కొత్త జంటకు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ డ్రమ్మును గిఫ్ట్ గా ఇవ్వడం క్రేజీగా అనిపించింది. అయితే, ఈ వీడియోను చూసి కొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతుంటే, మరికొంత మంది సీరియస్ గా కామెంట్స్ పెడుతున్నారు. శుభమా అని పెళ్లి చేసుకుంటే.. చావు మేళం ఏందిరా అయ్యా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇది ఫన్నీగా లేదు, మరింత దారుణంగా ఉందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “పెళ్లి రోజే మర్డర్ ప్లాన్ చేస్తున్నారా? మీరు గొప్ప ఫ్రెండ్స్ రా నాయానా..” అని మరికొంత మంది రియాక్ట్ అవుతున్నారు.
Read Also: టాప్ లేచిపోయినా.. ఆపకుండా దూసుకెళ్లిన బస్సు డ్రైవర్!