Virat Kohli : సాధారణంగా టీమిండియా (Team India) క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కొందరు ఆటగాళ్లను సెలెక్టర్లు కావాలని సెలెక్ట్ చేయడం లేదని పేర్కొంటున్నారు. మరికొందరు ఆటగాళ్లు సెలెక్ట్ అయినప్పటికీ సత్తా చాటలేక పోతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికొస్తే.. ఇప్పటికే కొందరికి పెట్టినెస్ టెస్టులు పూర్తయ్యాయి. ఇంకొందరికి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ టెస్ట్ లు జరపలేదని కొందరు పేర్కొంటే.. మరికొందరు విరాట్ కోహ్లీ కి ఇంగ్లాండ్ (England) లో ఫిట్నెస్ టెస్ట్ పూర్తయినట్టు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆటగాళ్లందరికీ ఇండియాలోనే టెస్టులు జరగగా.. ఆయనకు మాత్రం విదేశాల్లో నిర్వహించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
వాళ్లకు ఇక్కడ.. ఆయన కు అక్కడా.. ?
ఇటీవలే టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్, సిరాజ్, బుమ్రా వంటి ఆటగాళ్ళ కి బెంగళూరులో ఫిట్నెస్ టెస్టులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెలలో నిర్వహించే సెకండ్ పేజ్ లో మెగాస్టార్ ప్లేయర్లను కూడా పరీక్షించనున్నారు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) కి లండన్ లో పర్మిషన్ ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లకు అక్కడ ఆయనకిక్కడా..? అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇటీవలే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరిగిన ప్రీ సీజన్ ఫిట్నెస్ పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో తాజాగా లండన్ లో విరాట్ కోహ్లీ పరీక్షలు జరిగాయ అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ అసలు క్రికెట్ ఆడలేదు. ఇటీవలే టీ 20, టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసినదే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కేవలం వన్డేలకు మాత్రమే క్రికెట్ ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ లండన్ లోనే ఉంటున్నాడు. వన్డే మ్యాచ్ లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చి మ్యాచులు ఆడుతున్నాడు. ఆ తర్వాత తిరిగి లండన్ కు వెళ్తున్నాడు.
అప్పుడే విరాట్ రిటైర్మెంట్ జరుగనుందా..?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారి టైటిల్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్న అనంతరం విరాట్ కోహ్లీ లండన్ కు వెళ్లాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఇండియా కి తిరిగి రాలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ పై తొక్కి సలాట కారణంగా 11 మంది మరణించడంతో కేసు నమోదు అయింది. ఇటీవల లండన్ లో షాప్ పటేల్ అనే వ్యక్తితో పూర్తిగా తెల్ల గడ్డం తో ఫోటో దిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు విరాట్ కోహ్లీ. వాస్తవానికి విరాట్ కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ ఫిట్నెస్ క్రికెటర్. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కి 36 ఏళ్ళు. అయినప్పటికీ తను ఫిట్నెస్ ని చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నాడు. మరోవైపు 2027 వన్డే వైరల్ కప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టి20, టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
🚨 In a rare move, BCCI conducted Virat Kohli's fitness test in LONDON 🤯
~ Perhaps first-time in Indian Cricket History that a player got such luxurious treatment. pic.twitter.com/oPu2gf3A46— RCBXTRA (@RCBXTRAOFFICIAL) September 3, 2025