Hyderabad Traffic Diversions: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే వాహనదారులు, ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ చుట్టు పక్కల మార్గాల్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ట్రాఫిక్ డైవర్షన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ ఆంక్షలు ఈ నెల 5 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు
⦿ సెయిలింగ్ క్లబ్ ‘T’ జంక్షన్: కర్బలా మైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించబడదు. సెయిలింగ్ క్లబ్ దగ్గర కవాడిగూడ క్రాస్ రోడ్ల వైపు మళ్లించబడుతుంది. లిబర్టీ వైపు వెళ్లాలనుకునే వారు ఖైరతాబాద్ కవాడిగూడ క్రాస్ రోడ్లు, డిబిఆర్ మిల్స్, వార్త లేన్, స్విమ్మింగ్ పూల్, బండ మైసమ్మ, ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్లు, ఆర్కె మఠం, కట్టమైసమ్మ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్ మీదుగా వెళ్ళవచ్చు. ట్యాంక్‌బండ్ ద్వారా పంజాగుట్ట వైపు వెళ్లాలనుకునే వారు రాణిగంజ్, మినిస్టర్ రోడ్, బేగంపేట, పంజాగుట్ట మీదుగా వెళ్ళవచ్చు.
⦿ వివి విగ్రహం: పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్ళే సాధారణ ట్రాఫిక్, పివిఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై అనుమతించబడదు. నిరంకారి, ఓల్డ్ పిఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్ వైపు మళ్లించబడుతుంది.
⦿ తెలుగు తల్లి జంక్షన్: అంబేద్కర్ విగ్రహం నుండి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించబడదు. ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
⦿ తెలుగు తల్లి ఫ్లైఓవర్: సికింద్రాబాద్ వైపు ఇక్బాల్ మినార్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించబడదు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది. కట్ట మైసమ్మ ఆలయం, DBR మిల్స్, కవాడిగూడ X రోడ్ వైపు వెళ్లవచ్చు.
⦿ DBR: కట్ట మైసమ్మ ఆలయం నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్.. ధోబీ ఘాట్ అప్పర్ ట్యాంక్ బండ్ కు అనుమతించబడదు. DBR మిల్స్ దగ్గర కవాడిగూడ X రోడ్ వైపు మళ్లించబడుతుంది.
⦿ కవాడిగూడ X రోడ్: ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ సెయిలింగ్ క్లబ్ వైపు అనుమతించబడదు. కవాడిగూడ X రోడ్ దగ్గర DBR మిల్స్ వైపు మళ్లించబడుతుంది.
⦿ నల్లగుట్ట వంతెన: మినిస్టర్ రోడ్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ P.V.N.R మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు అనుమతించబడదు. నల్లగుట్ట వంతెన దగ్గర కర్బాలా వైపు మళ్లించబడుతుంది.
⦿ బుద్ధ భవన్: బుద్ధ భవన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ P.V.N.R మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు అనుమతించబడదు. నల్లగుట్ట X రోడ్ దగ్గర మినిస్టర్ రోడ్ వైపు మళ్లించబడుతుంది. NTR మార్గ్, పీపుల్స్ ప్లాజా, P.V.N.R మార్గ్ (నెక్లెస్ రోడ్) దగ్గర ట్రాఫిక్ ను బట్టి ఆంక్షలు విధించబడుతాయి.
ప్రయాణీకులు, వాహనదారులు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి సూచించిన మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, ప్రయాణికులు సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626 కు కాల్ చేయాలని సూచించారు.
Read Also: వందేభారత్ స్లీపర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్, ఫస్ట్ రూట్ ఇదే!