Big Stories

BCCI Sports News: ఆటగాళ్లపై పనిభారం.. బీసీసీఐ పట్టించుకోవడం లేదా?

 

- Advertisement -
BCCI Contract
 

Team India latest sports news today: ఇంగ్లాండ్ తో జరుగుతున్న సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ముగిసేందుకు చివరి టెస్ట్ ఒకటి మిగిలి ఉంది. ధర్మశాలలో మార్చి 7 నుంచి 11 వరకు జరగనున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్ కి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. కేవలం పని భారం తగ్గించేందుకు ఇలా చేసింది.

- Advertisement -

ఇప్పుడా పనిభారం అనేది బీసీసీఐకి  పెద్ద తలనొప్పిగా మారనుంది. ఎందుకంటే శ్రేయాస్, ఇషాన్ ఇద్దరూ బీసీసీఐ నిర్ణయాలను ఎదిరించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయింది. కేవలం ఇక్కడ ఆడకపోతే రంజీలు ఆడాలి. అక్కడ ఆడకపోతే ఐపీఎల్ ఆడాలి. అక్కడ నుంచి జాతీయ జట్టులో ఆడాలి. వన్డేలు, టీ 20లు, టెస్ట్ మ్యాచ్ లు, రెడ్ బాల్ క్రికెట్, వైట్ బాల్ క్రికెట్, దేశ విదేశాలు ప్రయాణాలు, రకరకాల ఫుడ్డు  ఇలా జీవితం మిషన్ లా మారిపోతోంది.

విపరీతమైన క్రికెట్ ఆడటం వల్ల శ్రేయాస్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఇషాన్ కిషన్ మానసిక విశ్రాంతి లేక బాధపడ్డాడు. వీరికి తోడు గాయాలతో ఒకొక్క క్రికెటర్ దూరం అవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వీరందరూ అపరిమితమైన క్రికెట్ ఆడి బాధపడుతున్నవారే. జాతీయ జట్టుకి దూరమైన వారే… మూడో టెస్ట్ లో సెంచరీ చేసి, వెన్నునొప్పితో స్టార్ ఓపెనర్ యశస్వి కూడా రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. వరల్డ్ కప్ లో గిల్ కూడా తొడ కండరం పట్టేయడంతో ఒక మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు.

read more: బీసీసీఐ పైకి ఇషాన్, శ్రేయాస్ రివర్స్ స్వింగ్..

విరాట్ కొహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ కూడా భార్య డెలివరీకి అందుబాటులో లేకపోవడం దారుణమని, ఇంత పేరు, డబ్బు సంపాదించి ఉపయోగం ఏమిటి? అని బాధపడి కెరీర్ ను పణంగా పెట్టి వెళ్లిపోయాడు.
నాలుగో టెస్టు మ్యాచ్ మధ్యలో అశ్విన్ తల్లికి అనారోగ్యం అని తెలిసి, తను ఆట మధ్యలోంచే వెళ్లిపోయాడు.

మరి ఇవన్నీ బీసీసీఐ గ్రహిస్తుందో లేదో తెలీదు. వీడుకాకపోతే మరొకడు అన్నట్టు కొత్తవాళ్లకి అవకాశాలిస్తూ ఉన్నవాళ్లతో ఆడిస్తూ వెళ్లిపోతోంది. ఇది బీసీసీఐ డబ్బు యావలో పడి  ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా, వ్యక్తిగత జీవితం లేకుండా చేస్తోందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి.

ఇది రాబోయే రోజుల్లో ప్రమాదకరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బహుశా ఇవన్నీ ద్రష్టిలో పెట్టుకొనే అనుకుంటా…నాలుగో టెస్టుకి బూమ్రాకి విశ్రాంతినిచ్చారు. ఇప్పుడు తను ఐదో టెస్ట్ లో ఆడనున్నాడు. రాహుల్ ఆడేది కష్టమే అంటున్నారు. ఇక మూడు టెస్టుల నుంచి విఫలమవుతున్న రజత్ పటీదార్ ను తప్పించి దేవదత్ కి అవకాశం ఇస్తారని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News