BigTV English

Prabhas: విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా.. వీడియో రిలీజ్ చేస్తూ ఏమన్నాడంటే?

Prabhas: విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా.. వీడియో రిలీజ్ చేస్తూ ఏమన్నాడంటే?


Gaami Movie Trailer: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎప్పుడూ ఒకే జానర్‌లో కాకుండా కొత్త కొత్త కథలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే పలు డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకాభిమానులను పలకరించిన విశ్వక్ ఇప్పుడు మరో సరికొత్త కథతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని కార్తీక్ శబరీశ్ – శ్వేత నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశారు.


ఇందులో హీరో ఒక సమస్యతో బాధపడుతుంటాడు. అయితే ఆ సమస్య నుంచి బయటపడటానికి హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ దాదాపు 36 ఏళ్లకు ఒకసారి ఓ అద్భుతం జరగబోతుందని హిమాలయాలకు బయలుదేరుతాడు. ఇక అలాంటి సమయంలో అతడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది స్టోరీ. దీనిని హైలెట్ చేస్తూ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.

READ MORE: ఒక విచిత్ర వ్యాధి.. మూఢ నమ్మకం.. పరిశోధన.. కలయికే “గామి”!

ఇక ఈ ట్రైలర్ ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రేక్షకాభిమానులు ఈ ట్రైలర్ చూసి విశ్వక్ సేన్‌కు మరో హిట్టు కాయమని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్రైలర్‌పై పలువురు వారి అభిప్రాయాలను తెలుపుతుండగా.. తాజాగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఈ ట్రైలర్ గురించి ఓ వీడియో చేసి చిత్రయూనిట్‌కి షేర్ చేశాడు. ఆ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. గామి ట్రైలర్ తనకు చాలా బాగా నచ్చిందని తెలిపాడు. ప్రతి డిపార్ట్‌మెంట్‌కి సంబందించిన హార్డ్ వర్క్ ట్రైలర్‌లో కనిపిస్తుందని అన్నాడు.

READ MORE: ఎయిర్‌పోర్ట్‌లో బేబీ బంప్‌తో దీపికా పదుకొనే.. రణవీర్ ఎలా కాపాడాడో చూడండి

అంతేకాకుండా విశ్వక్ సేన్ కూడా బాగా చేశాడని ప్రశంసలు కురిపించాడు. ఇక ట్రైలర్ చూసిన తర్వాత తానే కావాలని ఈ వీడియో ఇవ్వాలని అనుకున్నట్లు అందులో చెప్పుకొచ్చాడు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది అంటూ పేర్కొన్నాడు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ వీడియోతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడు.

Tags

Related News

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Big Stories

×