Jasprit Bumrah: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ {Border Gavaskar Trophy} లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన చివరి 5వ టెస్ట్ లో బుమ్రా {Jasprit Bumrah}ని వెన్ను గాయం బాధించింది. దీంతో ఐదవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 10 ఓవర్లు మాత్రమే వేసి మ్యాచ్ మధ్యలోనే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాడు.
Also Read: Jasprit Bumrah: “కోల్డ్ ప్లే” కన్సర్ట్ లో బుమ్రా సందడి.. దద్దరిల్లిన ఈవెంట్!
ఈ క్రమంలో {Jasprit Bumrah} తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. అతడు ఎప్పుడు పూర్తిగా కోరుకుంటాడనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} సమయానికల్లా బుమ్రా కోలుకుంటాడని సెలెక్టర్లతోపాటు బీసీసీ కూడా ఆశిస్తోంది. గాయం కారణంగా బుమ్రా {Jasprit Bumrah} ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా లీగ్ ప్రారంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా బుమ్రా గాయానికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ స్టార్ పేసర్ {Jasprit Bumrah} ని న్యూజిలాండ్ తరలించేందుకు యోచిస్తోందట బీసీసీఐ. న్యూజిలాండ్ లో ఆర్థోపెడిక్ సర్జన్ రోవన్ షౌటర్ {Orthopedic surgeon Rowan Shouter} అనే వైద్యుడి దగ్గర బుమ్రా ట్రీట్మెంట్ చేయించుకోనున్నట్లు సమాచారం. బుమ్రాకి అక్కడ శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ లో చికిత్స పూర్తయిన అనంతరం బుమ్రా {Jasprit Bumrah} ఫిట్ గా ఉన్నట్లు సర్టిఫికెట్ వస్తేనే అతడు ఛాంపియన్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} లో ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పలు కథనాల ప్రకారం ప్రస్తుతం డాక్టర్ షౌటెన్ తో బీసీసీఐ వైద్య బృందం చర్చలు జరుపుతోందని.. త్వరలోనే బుమ్రా పరిస్థితి తీవ్రతను సెలక్షన్ కమిటీకి అందజేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} కి బుమ్రా {Jasprit Bumrah} దూరం అయితే అది భారత్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లేనని చెప్పాలి. ఎందుకంటే అతడిని రీప్లేస్ చేసే ఆటగాళ్లు జట్టులో లేకపోవడమే ఇందుకు కారణం.
Also Read: Champions Trophy 2025: ట్రోపీ కంటే ముందే టీమిండియాకు అగ్ని పరీక్ష..పిల్లబచ్చాలతోనే?
2023లో కూడా వెన్నునొప్పి కారణంగా బుమ్రా {Jasprit Bumrah} ఐదు నెలలకు పైగా క్రికెట్ కి దూరమయ్యాడు. ఈ గాయం కారణంగా అతడు ఐపిఎల్ 2023 నుంచి కూడా వైదొలిగాడు. ఇతడి స్థానంలో ముంబై ఇండియన్స్ {Mumbai Indians} జట్టు సందీప్ వారియర్ ని జట్టులోకి తీసుకుంది. ఇదే గాయం కారణంగా టి20 వరల్డ్ కప్ లోను ఆడలేదు బుమ్రా. ఇప్పుడు మరోసారి అదే గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ {Champions Trophy 2025} కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు భారత అభిమానులు.
🚨 UPDATE ON JASPRIT BUMRAH 🚨 (TOI).
– Bumrah's fate depends on New Zealand doctors report.
– BCCI Medical team in touch with NZ doctors.
– The selectors know it will be a miracle if Bumrah is 100% fit for CT.
– Medical team sending Bumrah to NZ will depend on their feedback pic.twitter.com/KDzfi7NS3c— Tanuj Singh (@ImTanujSingh) January 27, 2025