BCCI: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచిన భారత జట్టు సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. ఈ ట్రోఫీలో టీమిండియా అద్భుతంగా రానిస్తున్నప్పటికీ.. కెప్టెన్ గా రోహిత్ శర్మ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లపై తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు కెప్టెన్. ఇక ఆదివారం రోజు న్యూజిలాండ్ లో జరిగిన మ్యాచ్ లో కివీస్ పై భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: KKR – Rahane: కొత్త కెప్టెన్ ను ప్రకటించిన కోల్ కతా…. టెస్ట్ ప్లేయరే దిక్కు అయ్యాడు?
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ 17 బంతులలో 15 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ ఎక్స్ {ట్విటర్} వేదికగా రోహిత్ శర్మను తిడుతూ పోస్ట్ చేసింది. షమా ట్విట్టర్ లో ఏం పోస్ట్ చేసిందంటే.. “రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడు. అతడు బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. అతడికి ఫిట్నెస్ లేదు. ఏదో అదృష్టవశాత్తు భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు.
ఇప్పటివరకు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన వారిలో.. రోహిత్ శర్మ జస్ట్ యావరేజ్ ఆటగాడు” అంటూ సంచలన ట్విట్ చేసింది. దీంతో కాంగ్రెస్ నేత చేసిన ఈ పోస్ట్ పెద్ద దుమారాన్ని రేపింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సహా బీజేపీ నేతలు, క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా షమా వ్యాఖ్యలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు {బీసీసీఐ} కూడా స్పందించింది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. షమా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ” ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం. ఈ వ్యాఖ్యలు ఆటగాడి పైనే కాకుండా మొత్తం జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇటువంటి విమర్శలు చేయడం మానుకోవాలి. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడుతున్నారు.
Also Read: Kohli- Iyer: అయ్యర్ ను ర్యాగింగ్ చేసిన కోహ్లీ.. నవ్వు ఆపుకోలేరు !
దాని ఫలితాలు కూడా చూస్తున్నాం. వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి” అని హితవు పలికారు. ఇక షమా మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..” నేను రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి మాత్రమే మాట్లాడాను. అది బాడీ షేమింగ్ కాదు. ప్లేయర్స్ ఫిట్ గా ఉండాలని నేను నమ్ముతాను. కానీ అతడు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడని భావించాను. దాని గురించే పోస్ట్ చేశాను. నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు. నాకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా చెప్పే హక్కు ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.