IIT Baba: ఇటీవల మహా కుంభమేళాలో ఐఐటీ బాబా అభయ్ సింగ్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచులో కూడా టీమిండియా ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. కానీ అది కూడా ప్లాప్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాడు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పాడు. ఇప్పుడు అదే బాబా మళ్లీ వార్తల్లో నిలిచాడు.
తాజాగా జైపూర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అభయ్ సింగ్ సోషల్ మీడియాలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం (మార్చి 3) రిద్ధి సిద్ధి పార్క్ క్లాసిక్ హోటల్‌కు చేరుకుని ఐఐటీ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో బాబా నుంచి గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతనిపై NDPS చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం జైపూర్ పోలీసులు అభయ్ సింగ్‌ను విచారిస్తున్నారు.
జైపూర్ సౌత్ డీసీపీ శిప్రపథ్ తెలిపిన వివరాల ప్రకారం అభయ్ సింగ్ ఓ హోటల్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు వెల్లడించారు. ఆ క్రమంలో తమ బృందంతో ఘటనా స్థలానికి చేరుకునేసరికి అభయ్ సింగ్ హోటల్లో కనిపించాడన్నారు. అతను గంజాయి తీసుకున్నానని చెప్పినట్లు వెల్లడించారు. ఆ క్రమంలో అతను ఏదైనా సమాచారం ఇస్తే, అతనికి ఏది గుర్తుండదని పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులు 1.50 గ్రాముల బరువున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే తక్కువ మొత్తంలో అతని దగ్గర గంజాయి ఉండటం వల్ల, ఐఐటీ బాబాను అరెస్టు చేయలేదని డీసీపీ వివరించారు.
Read Also: Xiaomi 15: షియోమీ 15 అల్ట్రా రిలీజ్ డేట్ ఫిక్స్.. 200MP కెమెరాతోపాటు మరిన్ని ఫీచర్లు..
అంతేకాదు అభయ్ సింగ్ గంజాయిని మహాదేవ్ ప్రసాదం అని పేర్కొన్నారు. అందరు బాబాలు దీనిని తాగుతారని అన్నాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేస్తున్న క్రమంలో వెల్లడించారు. సాదువులు దీనిని బహిరంగంగా తాగుతారని, దానికి రుజువు కూడా ఉంటుందన్నారు. అయితే వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారా అని ఐఐటీ బాబా పోలీసులను ప్రశ్నించారు.
ఫిబ్రవరి 28న ఓ వార్తా ఛానల్ తనను ఇంటర్వ్యూకి పిలిచిందని ఐఐటీ బాబా అన్నారు. ఆ సమయంలో పలువురు అతనితో దురుసుగా ప్రవర్తించారని, కొంత మంది న్యూస్ రూమ్ లోపలికి వచ్చి గొడవ పడ్డారని వెల్లడించారు. తనని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. అక్కడే ఉన్న స్వామి వేదమూర్తి నంద సరస్వతి కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తి కర్రతో దాడి చేశారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కుంభమేళా ముగిసింది కానీ, ఐఐటీ బాబా మాత్రం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తున్నాడు. పలు మార్లు బాబా తన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా వైరల్ అవుతున్నాయి. ఈ ఐఐటీ బాబా విషయంలో ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.