E-Paper
Advertisement

Kohli- Iyer: అయ్యర్ ను ర్యాగింగ్ చేసిన కోహ్లీ.. నవ్వు ఆపుకోలేరు !

Kohli- Iyer: అయ్యర్ ను ర్యాగింగ్ చేసిన కోహ్లీ.. నవ్వు ఆపుకోలేరు !
Advertisement

Kohli- Iyer: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగితే ఎంత అగ్రేషన్ మూడ్ లోకి వెళ్ళిపోతాడో అందరికీ తెలిసిందే. కానీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం సహచర ఆటగాళ్లతో ఎంతో సరదాగా ఉంటాడు. డ్రెస్సింగ్ రూమ్ లో సైతం జోక్స్ వేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచేత్తుతాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితో సరదాగా ఉంటాడు. యువ ఆటగాళ్లతో కలిసి అప్పుడప్పుడు అల్లరి చేస్తుంటాడు.

Also Read: IPL 2025: IPL జట్లకు BCCI షాక్.. ఇకపై కొత్త రూల్స్.. పాటించకపోతే వేటు తప్పదు ?

Advertisement

జోక్స్ వేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఇమిటేషన్ లో మంచి ప్రావీణ్యం ఉన్న విరాట్.. ఈ టాలెంట్ తో అప్పుడప్పుడు తోటి ప్లేయర్లను వెక్కిరిస్తూ ఉంటాడు. తాజాగా ఇలానే శ్రేయస్ అయ్యర్ ని {Kohli- Iyer} ర్యాగింగ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆదివారం రోజు న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కివీస్ పై భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఏడవ ఓవర్ సందర్భంగా అక్షర్ పటేల్ వేసిన బంతిని.. విల్ యంగ్ ఆఫ్ సైడ్ స్ట్రైట్ గా తరలించాడు. దీంతో ఆ బంతి నేరుగా శ్రేయస్ అయ్యర్ దగ్గరికి వెళ్ళింది. అయితే ఆ బంతి శ్రేయస్ అయ్యర్ చేతులలో మిస్ అయ్యింది. ఈ నేపథ్యంలో కంగారు పడిన శ్రేయస్ అయ్యార్ వెనక్కి తిరిగి చూస్తే బంతి కనిపించలేదు. చుట్టుపక్కల చూసినా అతడికి బంతి కనిపించలేదు.

Advertisement

అలా కంగారు పడిన శ్రేయస్ అయ్యర్ అసలు బంతి ఎటు వెళ్లిందా అంటూ చుట్టూ గిరగిరా తిరిగాడు. ఆ తర్వాత వెంటనే విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి ఆ బంతి కనిపించడం లేదని చెబుతూ లాంగ్ ఆన్ వైపు ఫీల్డింగ్ చేయడానికి వెళ్ళాడు. దాంతో విరాట్ కోహ్లీ ఆ బంతిని పట్టుకోకుండా గింగిరాలు తిరుగుతున్నావేంటని.. అయ్యర్ ని ఇమిటేట్ చేస్తూ {Kohli- Iyer} చుట్టూ తిరిగాడు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు.

Also Read: Congress- Rohit: ఇంత బరువు ఉన్నాడు…రోహిత్‌ పై కాంగ్రెస్‌ మహిళా నేత బాడీ షేమింగ్ కామెంట్స్‌ !

ఇలా శ్రేయస్ అయ్యర్ ని విరాట్ కోహ్లీ ర్యాగింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది మాత్రమే కాకుండా మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ.. తన ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డోని ఇమిటేట్ చేశాడు. గోల్ కొట్టినప్పుడు రోనాల్డో ఒకరకంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అచ్చం అలానే విరాట్ కోహ్లీ కూడా వికెట్ పడిన అనంతరం రోనాల్డోలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300 వన్డే కావడంతో.. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీని చూస్తూ ఎంజాయ్ చేసింది.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×