E-Paper
Advertisement

BCCI: గంభీర్ ప‌వ‌ర్స్ త‌గ్గించిన బీసీసీఐ…ష‌మీకి అదిరిపోయే ఆఫ‌ర్ ?

BCCI: గంభీర్ ప‌వ‌ర్స్ త‌గ్గించిన బీసీసీఐ…ష‌మీకి అదిరిపోయే ఆఫ‌ర్ ?
Advertisement

BCCI:  భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పాత ప్లేయర్లకు మళ్ళీ అవకాశాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గౌతమ్ గంభీర్ కారణంగా జట్టుకు దూరమైన ప్లేయర్ల అందరిని మళ్లీ తీసుకువచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లాన్ చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే చాలా రోజులుగా టీమిండియా కు దూరం అయిన మహమ్మద్ షమీ, జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అతనికి అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, గౌతమ్ గంభీర్ కు షాక్ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

షమీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి యూటర్న్

Advertisement

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆస్ట్రేలియా బౌలర్ల తరహాలో విపరీతమైన వేగంతో బంతులు సంధిస్తుంటాడు. అదే సమయంలో వికెట్లు కూడా తీయడంలో దిట్ట. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో లీడింగ్ వికెట్ టేకర్ గా మహమ్మద్ షమీ నిలిచాడు. ఆ తర్వాత గాయపడిన మహమ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. అప్పటినుంచి అతనికి సరిగ్గా బీసీసీఐ అవకాశాలు ఇవ్వడం లేదు. దీనికి ముఖ్య కారణం గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి.

అయితే ఇప్పుడు వాళ్ళ, పవర్స్ మొత్తం తగ్గించి మహమ్మద్ షమీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. చాలాకాలంగా పక్కనపెట్టిన షమీ విషయంలో బిసిసిఐ తాజాగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సెలక్టర్లు అతన్ని పరిశీలిస్తున్నారట. షమీ దేశ వాలి ప్రదర్శన అద్భుతంగా ఉంది. పునరాగమనం దగ్గరలోనే ఉందని బీసీసీఐ వర్గాలు కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ కు కూడా అతడు ఎంపిక కావచ్చని చెబుతున్నారు. గౌతమ్ గంభీర్ తో పాటు అగార్కర్ వద్దని ఎంత వాదించిన బీసీసీఐ అస్సలు వినిపించుకోవడంలేదట. వాళ్లను కాదని షమీని సెలెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

మహమ్మద్ షమీ దేశ‌వాళీ ప్ర‌ద‌ర్శ‌న‌

Advertisement

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ మధ్యకాలంలో దేశవాళి క్రికెట్లో అదరగొడుతున్నాడు. బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహమ్మద్ షమీ, జాతీయ జట్టులోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. ఇప్పటివరకు 94 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ. ఇందులో 339 వికెట్లు పడగొట్టాడు. 79 పరుగులు ఇచ్చే ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. ఇది అతని బెస్ట్. అటు లిస్టు ఏ క్రికెట్ లో తన ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ వరకు సన్రైజర్స్ జట్టు తరఫున ఆడిన మహమ్మద్ షమి, వచ్చే ఏడాది లక్నోకు ఆడనున్నాడు.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

 

Related News

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అడ్డంకి !

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

Big Stories

Advertisement
×