E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి మీదకు వెళ్లిన రామ్మూర్తి

Nindu Noorella Saavasam Serial Today December 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి మీదకు వెళ్లిన రామ్మూర్తి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

మిస్సమ్మ ఇంట్లోంచి వెళ్లిపోయిందని అర్థం అయ్యాక పిల్లుల ఏడుస్తుంటారు. అప్పుడే రాథోడ్ ఫోన్‌ చేసి చెప్పడంతో రామ్మూర్తి కంగారుగా అమర్‌ ఇంటికి వస్తాడు. నా బిడ్డకు ఏమైంది బాబు అని అడుగుతాడు. అసలు అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి..? అని ప్రశ్నిస్తాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఇలా జరగడం ఏంటి..? బాబు అంటూ బాధపడుతుంటే రాథోడ్‌ సార్‌ మీరు టెన్షన్‌ అవ్వకండి సార్‌ మిస్సమ్మకు ఏమీ అవ్వదు సార్‌ అంటాడు. ఇంతలో అమ్ము ఏడుస్తూ.. చెప్పండి డాడ్‌ మిస్సమ్మకు ఏమైంద తాతయ్య కూడా అడుగుతున్నారు కదా..? అసలు ఏం జరిగింది డాడ్‌  అని అడుగుతుంది. దీంతో అమర్‌ తను ఎక్కడికి వెళ్లలేదు.. వస్తుంది. మీరు ఏడవకండి అని చెప్తాడు.

అయినా పిల్లలు ఏడుస్తుంటారు. అమ్ము ఏడుస్తూ.. డాడీ రాత్రి మేము నిద్రపోయే ముందు మిస్సమ్మ మా గదిలోకి వచ్చింది. ఏదో సెండాఫ్‌ ఇస్తున్నట్టుగా మాతో మాట్లాడింది అని చెప్పగానే.. అంజు కూడా ఏడుస్తూ… మేము మీరు చెప్పిన మాట వినాలని రోజూ స్కూల్‌కు వెళ్లాలని అల్లరి చేయకూడదని బాగా చదువుకోవాలని.. టైం టూ టైం తిని నిద్రపోవాలని ఎన్నో జాగ్రత్తలు చెప్పింది డాడ్‌ అంటూ అంజు చెప్తూ ఏడుస్తుంది. దీంతో అమర్‌ అంటే వెళ్లిపోవాలని భాగీ ముందే డిసైడ్‌ అయిందన్నమాట. అందుకే పిల్లలతో అలా మాట్లాడి ఉంటుందా..? అని మనసులో అనుకుంటాడు. ఇంతలో ఆనంద్‌ మాకు అప్పుడే డౌటు వచ్చింది డాడ్‌. బుజ్జమ్మను చూసుకోవడంలో మిస్సమ్మ బిజీగా ఉంటానని మమ్మల్ని మేమే చూసుకోవాలని చెప్పింది అంటూ బాధపడుతుంటాడు.

Advertisement

ఆకాష్‌ కూడా మిస్సమ్మ ఎందుకు ఇలా చేసింది డాడ్‌ .. బుజ్జమ్మను తీసుకుని ఎందుకు వెళ్లిపోయింది అంటాడు. మనోహరి మాత్రం  నవ్వుకుంటుంది. అమర్‌ పిల్లలను తను వచ్చేస్తుంది. మీరు ఏడవకండి..? మనోహరి పిల్లలను తీసుకెళ్లు అని చెప్పగానే.. మనోహరి సరే అమర్‌ అంటూ పిల్లలను తీసుకుని లోపలికి వెళ్తుంది. రామ్మూర్తి బాధగా ఏంటి బాబు పిల్లలు ఏదేదో మాట్లాడుతున్నారు. నా కూతురుకు ఏమైంది. నా బిడ్డ మనవరాలు ఎక్కడికి వెళ్లిపోయారు బాబు.. అని అడగ్గానే.. తెలియదు మామయ్య.. తెలుసుకుంటాను.. అంటూ అమర్‌ పైకి వెళ్లిపోతాడు. రామ్మూర్తి ఏడుస్తూ.. అమ్మా భాగీ ఎంత పని చేశావమ్మా..? అసలు ఎందుకిలా చేశావమ్మా..? ఎందుకిలా చేశావు తల్లి.. అంటూ కుర్చీలో కూలబడిపోతాడు. రాథోడ్‌ సార్‌ మీరు టెన్షన్‌ అవ్వకండి సార్‌ మిస్సమ్మకు ఏమీ అవ్వదు సార్‌ అంటాడు. దీంతో రామ్మూర్తి ఏమీ అవ్వకపోవడం ఏంటి..? రాథోడ్‌.. ఒక చంటి బిడ్డను తీసుకుని అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోవడం అంటే మామూలు విషయమా..? అసలు నా భాగీకి ఏమైంది..? నా కూతురును ఆ మనోహరే ఏదో  అని ఉంటుంది. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయి ఉంటుంది. ఒసేయ్‌ మనోహరి అంటూ గట్టిగా కేకలు వేస్తాడు రామ్మూర్తి.

దీంతో రాథోడ్‌ సార్‌ ఆగండి సార్‌ మిస్సమ్మ వెళ్లిపోవడానికి మనోహరికి ఏమీ సంబంధం లేదు సార్‌ మిస్సమ్మే కావాలని వెళ్లిపోయింది సార్‌.. అని చెప్పగానే.. రామ్మూర్తి షాక్‌ అవుతాడు.. నువ్వు ఏం అంటున్నావు రాథోడ్‌.. అసలు ఏమంటున్నావు రాథోడ్‌.. అని అడగ్గానే.. నిన్న మిస్సమ్మ ఏదో బాధగా కొత్తగా మాట్లాడింది సార్‌.. పిల్లలను సార్‌ను జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగింతల్లా చెప్పింది సార్‌.. పిల్లలకు చెప్పినట్టే నాకు కూడా సెండాఫ్‌ చెప్పింది సార్‌.. అప్పుడే నాకు అనుమానం వచ్చి ఎక్కడికి వెళ్తుతున్నావు మిస్సమ్మ అని అడిగాను.. ఓ నాలుగు రోజలు మా ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పింది. అందుకే సార్‌ ముందుగా మీకు ఫోన్‌ చేశాను.. అని చెప్పగానే.. భాగీ భాదగా వెళ్లిపోయింది అంటే దానికి కారణం ఆ మనోహరే అయ్యుంటుంది. ఈ విషయం వెంటనే బాబుగారికి చెప్పాలి ఇప్పటికిప్పుడు దాన్ని ఇంట్లోంచి తరిమేస్తే కానీ నా కూతురు ఇంటికి తిరిగి రాదు.. అంటూ రామ్మూర్తి వెల్లబోతుంటే..

Advertisement

రాథోడ్‌ ఆపేస్తాడు. సార్‌ వద్దు సార్‌.. మనోహరి గురించి మనం సార్‌ తో ఏమీ చెప్పకూడదని మిస్సమ్మ నా దగ్గర మాట తీసుకుంది సార్‌..అనగానే.. అదేంటి రాథోడ్‌ ఆ నీచురాలి గురించి అల్లుడు గారికి చెప్తానని భాగీ అనుకుంది కదా..? అనగానే.. అదే నాకు అర్థం కావడం లేదు సార్‌.. కానీ మిస్సమ్మ తిరిగి వచ్చే వరకు మనోహరి గురించి ఏమీ నోరు జారకూడదని ఒట్టు వేయించుకుంది సార్‌.. అని రాథోడ్‌ చెప్పగానే.. నా బిడ్డ ఎందుకు ఇలా చేసింది రాథోడ్‌  దానికిక ఏమైంది..? అంటూ ఏడుస్తుంటాడు. బాధపడకండి సార్‌ పిల్లల్ని సార్‌ను వదిలి మిస్సమ్మ బయట ఉండలేదు సార్‌ త్వరలోనే తిరిగి వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది సార్‌.. అని చెప్పగానే.. అప్పటి వరకు ఆ పిల్లల గతి ఈ ఇంటి గతి  ఏం కావాలి రాథోడ్‌ అసలు నా కూతురు ఎందుకు ఇలా చేసింది రాథోడ్‌ .. అంటూ రామ్మూర్తి ఏడుస్తుంటాడు. మరోవైపు పిల్లలను రూంలోకి తీసుకెళ్లి మనోహరి ఓదారుస్తుంది. కానీ పిల్లలు అసలు కన్వీన్స్‌ కారు. మిస్సమ్మ కావాలి అంటూ ఏడుస్తుంటారు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×