BigTV English

Gautam Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. టీమిండియాను కాపాడేందుకు తెలుగోడు వస్తున్నాడు ?

Gautam Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. టీమిండియాను కాపాడేందుకు తెలుగోడు వస్తున్నాడు ?

Gautam Gambhir: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024- 2025 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 )  టీం ఇండియా ఘోరంగా విఫలం అయింది. టీం ఇండియా ప్రదర్శన జట్టులో పెద్ద మార్పులు తీసుకువచ్చేలా ఉంది. టీం ఇండియా హెడ్ కోచ్ గంభీర్… స్టార్ ప్లేయర్లపై కోపంగా ఉంటే… కోచ్ గంభీర్ పైన బీసీసీఐ అసంతృప్తితో ఉందని సమాచారం అందుతోంది. వరుసగా మూడు టెస్టులలో టీమ్ ఇండియా విజయం సాధించలేకపోయింది. మొదటి టెస్ట్ గెలిచిన ఆనందం మరచిపోయేలా వరుసగా మ్యాచ్ లలో ఫలితాన్ని సాధించలేకపోయింది. రెండవ టెస్ట్ డ్రాగా ముగిసింది. మూడు, నాలుగు మ్యాచ్లను ఆస్ట్రేలియాలో చేతిలో ఓడిపోయి కోల్పోయింది టీమిండియా ( Team India ).


Also Read: Travis Head: దరిద్రం అంటే RCB దే.. హెడ్ ను కూడా వదిలేసుకుంది ?

ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వైఫల్యాలు భారత జట్టును తీవ్రంగా వేధిస్తున్నాయి. అందుకే టీం ఇండియా హెడ్ కోచ్ గంభీర్ వారి ప్రదర్శనపై అసంతృప్తిగా వ్యక్తం చేశాడట. స్టార్ ప్లేయర్లకు తన బాధ్యతను తీసుకున్నప్పుడు అండగా నిలిచిన గంభీర్… ఆరు నెలల పాటు తమకు నచ్చిన విధంగా ప్లేయర్లు అటను ఆడుకోవచ్చని ఆ తర్వాత వారి ఆటను రివ్యూ చేస్తానని గంభీర్ వెల్లడించాడట.


ఇప్పుడు ఆరు నెలలు పూర్తి అవడంతో పాటు కీలక సందర్భాల్లో రోహిత్, కోహ్లీ వైఫల్యం అవుతుండడంతో గంభీర్ వారి ప్రదర్శనపై బీసీసీఐ అధికారులు కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పైగా టెస్టుల కోసం తనకు పూజారా కావాలని సెలక్షన్ కమిటీ గంభీర్ రిక్వెస్ట్ చేశాడట. అయితే ఇదే సమయంలో కోచ్ గంభీర్ ( Gautam Gambhir ) ప్రదర్శ పై బీసీసీఐ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తనకు కావాల్సినట్లుగా కోచింగ్ టీమ్ లో మోర్ని మోర్కల్ వంటి ప్లేయర్లను కావాలని గొడవ పెట్టుకుని మరి వారిని కోచింగ్ టీం లోకి తీసుకున్నాడట గౌతమ్ గంభీర్.

Also Read: Washington Sundar: ఆసీస్ తో అంపైర్లు ఫిక్సింగ్… సుందర్ వికెట్ పై కొత్త వివాదం!

ఇక టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం భారత్ ను ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లలో గెలిపించలేకపోయాడు గంభీర్. శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోవడం, సొంత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ను కోల్పోవడం ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024- 2025 టోర్నమెంట్ లో దారుణ ప్రదర్శనకు బీసీసీఐ ( BCCI) సైతం ఆలోచనలో పడిందట. ఆటగాళ్ల ఎంపికలో టీం ఇండియా హెడ్ కోచ్ గంభీర్ విపరీతంగా జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అశ్విన్ లాంటి ఆటగాళ్లు సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బీసీసీఐ గంభీర్ పైన ఓ నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ టీం ఇండియా హెడ్ కోచ్ పదవి నుంచి గంభీర్ ను ( Gautam Gambhir ) తొలగిస్తే హైదరాబాద్ ఆటగాడు లక్ష్మణ్ ను ( VVS Laxman ) తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా టీం ఇండియా కు అసిస్టెంట్ కోచ్ గా లక్ష్మణ్ కొనసాగుతున్నాడు. గంభీర్ లీవ్ లో ఉంటె కోచ్ గా లక్ష్మణ్ ( VVS Laxman ) డ్యూటీ చేస్తున్నాడు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×