Travis Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును దరిద్రం వెంటాడుతూనే ఉంది. ఆ జట్టులో డేంజర్ బ్యాటర్లు ఎంత మంది ఉన్నా కూడా ఇప్పటి వరకు… ఒక టోర్నమెంట్ కూడా గెలవలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఛాంపియన్ కాలేకపోయింది. అంతే కాదు చాలా మంది డేంజర్ ప్లేయర్లు ఆ జట్టులో ఆడి… జట్టును గెలిపించేందుకు కష్టపడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో… ఆర్సిబి ఛాంపియన్ కాలేక పోయింది.
Also Read: Washington Sundar: ఆసీస్ తో అంపైర్లు ఫిక్సింగ్… సుందర్ వికెట్ పై కొత్త వివాదం!
ముఖ్యమైన విషయం ఏంటంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆడిన ప్లేయర్లు… ఆ జట్టు నుంచి బయటకు వెళ్లిన తర్వాత డేంజర్ గా ఆడుతున్నారు. ఇతర జట్లలో… స్వేచ్ఛగా ఆడి ఆ జట్లను గెలిపిస్తున్నారు. అయితే తాజాగా RCB గురించి మరో సంచలనం బయటికి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొన్న ఫైనల్ వరకు వెళ్లడానికి కారణం.. అభిషేక్ శర్మ అలాగే, ట్రావిస్ హెడ్. ఈ ఇద్దరు బ్యాటర్లు అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా డేంజర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అయితే విరుచుకుపడ్డాడు. హైదరాబాద్ జట్టును ఓ రేంజ్కి తీసుకువెళ్లాడు ట్రావిస్ హెడ్ ( Travis Head). అందుకే అతన్ని కావ్య పాప మరొకసారి కొనుగోలు చేసింది. వేలంలోకి వదిలి వేయకుండా 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది కావ్య పాప. అయితే అలాంటి డేంజర్ ఆటగాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గతంలో వదులుకుంది. అవును రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున… గతంలో…. ట్రావిస్ హెడ్ ఆడాడు.
2016 సీజన్ లో అతన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. 2016 అలాగే 2017 సీజన్లో రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున… కీలక ఇన్నింగ్స్ ఆడాడు ట్రావిస్ హెడ్. 2016 సంవత్సరంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మూడు మ్యాచ్లు ఆడిన హెడ్… 54 పరుగులు చేశాడు. ఇక 2017 సంవత్సరంలో ఏడు మ్యాచ్లు ఆడే అవకాశం హెడ్ కు వచ్చింది. ఇక ఈ ఏడు ఇన్నింగ్స్ లో అతనికి ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వలేదు. కొన్నిసార్లు మాత్రమే ఇచ్చారు. ఇక ఈ ఏడు మ్యాచ్లలో… మొత్తం 157 పరుగులు చేశాడు హెడ్.
Also Read: Jasprit – Sam Konstas: ఓవరాక్షన్ చేసిన ఆస్ట్రేలియా… తోక కత్తిరించిన బుమ్రా!
అయితే అతని వల్ల జట్టుకు పెద్దగా లాభం చేకూరడం లేదని… వేలంలో 2017 తర్వాత వదిలేశారు. ఆ తర్వాత అతని కొనుగోలు చేయడానికి ఏ జట్టు.. ఆసక్తి చూపించలేదు.. అతను కూడా ఐపీఎల్ ఆడేందుకు.. ముందుకు రాలేదు. 2023 ప్రపంచ కప్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇక 2024 కంటే ముందు హెడ్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేయడం జరిగింది. గత సీజన్లో… దుమ్ము లేపే బ్యాటింగ్ తో 500 కు పైగా పరుగులు చేశాడు ట్రావిస్ హెడ్. ఇందులో నాలుగు హాప్ సెంచరీలు అలాగే ఒక సెంచరీ కూడా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే… అప్పుడే హెడ్ ను వదలకుండా అలాగే అంటిపెట్టుకొని ఉంటే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ఒక స్థాయికి వెళ్ళేది. కానీ దురదృష్టం ఎప్పుడు వాళ్ళ వెంబడే ఉంటుంది కాబట్టి అతన్ని కోల్పోవాల్సి వచ్చింది.
Travis Head pic.twitter.com/C7LJWOZqeF
— RVCJ Media (@RVCJ_FB) January 3, 2025