BigTV English

Belgium : తృటిలో తప్పిన మరో సంచలనం

Belgium : తృటిలో తప్పిన మరో సంచలనం

Belgium : ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో సంచలనం నమోదవుతుందా? అన్నట్లుగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కెనడాపై అతికష్టం మీద గెలిచింది… వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ బెల్జియం. 36 ఏళ్ల తర్వాత మళ్లీ సాకర్ వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడిన కెనడా… బెల్జియంకు చుక్కలు చూపించింది. బెల్జియం గోల్‌కీపర్‌ కోర్టియస్ అడ్డుగోడలా నిలబడ్డాడు కాబట్టి సరిపోయింది గానీ… లేకపోతే కెనడా కూడా పెను సంచలనం సృష్టించేదే.


టోర్నీ ఫేవరెట్ జట్లలో ఒకటిగా భావిస్తున్న బెల్జియం.. తొలి మ్యాచ్‌లో కెనడాపై 1-0 గోల్స్ తేడాతో కష్టంగా గెలిచింది. స్టార్ ఆటగాళ్లకు కొదవలేని బెల్జియంకు… కెనడా గట్టి పోటీ ఇచ్చింది. కొన్నిసార్లు బెల్జియంపై పైచేయి సాధించింది కూడా. ఆధిక్యంలోకి వెళ్లేందుకు కెనడాకు పదో నిమిషంలోనే అద్భుత అవకాశం వచ్చింది. బెల్జియం ఆటగాడు కరాస్కో బంతిని చేత్తో తాకడంతో రిఫరీ కెనడాకు పెనాల్టీ ఇచ్చాడు. కానీ స్టార్‌ ఆటగాడు అల్ఫాన్సో డేవిస్‌ దాన్ని వృథా చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్‌కీపర్లలో ఒకడైన కోర్టియస్‌.. అతని స్పాట్‌ కిక్‌ను అడ్డుకున్నాడు. ఆ తర్వాత కూడా కెనడా బెల్జియంను ముప్పుతిప్పలు పెట్టింది. 30వ నిమిషంలో జాన్సన్‌ కొట్టిన షాట్‌ను కూడా బెల్జియం గోల్‌కీపర్ కోర్టియస్‌ సేవ్‌ చేశాడు. తొలి అర్ధభాగమంతా వెనుకబడ్డ బెల్జియం… 44వ నిమిషంలో బత్సువాయి గోల్‌ కొట్టడంతో అనూహ్యంగా ఆధిక్యంలో వెళ్లింది. కెనడా డిఫెన్స్‌ మీదుగా అల్డర్‌ వీరెల్డ్‌ ఇచ్చిన లాంగ్‌ బాల్‌ను అందుకున్న బత్సువాయి… దాన్ని ఈజీగా గోల్ పోస్టులోకి పంపాడు.

ఇక సెకండ్ హాఫ్ కూడా నువ్వా? నేనా? అన్నట్లు సాగింది. 80వ నిమిషంలో కెనడా ఆటగాడు లారిన్‌ కొట్టిన హెడర్‌ను కూడా బెల్జియం గోల్‌కీపర్ కోర్టియస్‌ అడ్డుకున్నాడు. చివరికి బెల్జియం 1-0 గోల్స్ తేడాతో గెలిచిందంటే… అది కోర్టియస్ వల్లే. ఓ పెనాల్టీ సహా మూడు కెనడా గోల్స్ అడ్డుకున్న కోర్టియస్… జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కెనడా 21 సార్లు గోల్స్ ప్రయత్నాలు చేయగా.. బెల్జియం కేవలం 9 ప్రయత్నాలే చేసింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×