BigTV English

FIFA : గోల్ కొట్టి.. సొంత దేశాన్ని ఓడించి..fifa world cup 2022 live score,fifa world cup 2022 live todayFIFA : గోల్ కొట్టి.. సొంత దేశాన్ని ఓడించి..

FIFA : గోల్ కొట్టి.. సొంత దేశాన్ని ఓడించి..fifa world cup 2022 live score,fifa world cup 2022 live todayFIFA : గోల్ కొట్టి.. సొంత దేశాన్ని ఓడించి..

FIFA : ఫిఫా వరల్డ్‌కప్‌లో భావోద్వేగ సన్నివేశం. కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టిన స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో… నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. మామూలుగా అయితే సాకర్ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో గోల్ కొడితే… ఆ ఆటగాడి సంబరాలు మామూలుగా ఉండవు. కానీ బ్రీల్ ఎంబోలో మాత్రం… గోల్ వేసిన తర్వాత అచేతనంగా నిలబడిపోయాడు. గోల్‌ వేసినందుకు జట్టు ఆటగాళ్లు అభినందిస్తున్నా, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నా… ఎంబోలో మాత్రం మౌనంగా ఉండిపోయాడు. కారణం.. స్విట్జర్లాండ్ తరఫున ఆడుతున్న బ్రీల్ ఎంబోలో సొంత దేశం కామెరూన్ కాబట్టి.


బ్రీల్‌ ఎంబోలో పుట్టింది, పెరిగింది కామెరూన్‌లోనే. అతని ఫుట్‌బాల్‌ కెరీర్‌ మొదలైంది కూడా అక్కడే. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతని కుటుంబం స్విట్జర్లాండ్‌కు తరలిరావడంతో… ఫుట్‌బాల్‌లో ఆ దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అప్పుడప్పుడూ తల్లితండ్రులతో కలిసి కామెరూన్ వెళ్లి వచ్చే ఎంబోలో… ఇప్పుడు సొంత దేశానికే ప్రత్యర్థిగా ఆడుతూ గోల్ చేయాల్సి రావడంతో… సంబరాలు చేసుకోలేకపోయాడు.

గ్రూప్-Gలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో… స్విట్జర్లాండ్‌పై కామెరూన్‌ తొలి అర్ధభాగంలో ఆధిపత్యం ప్రదర్శించినా… గోల్ మాత్రం చేయలేకపోయింది. స్విట్జర్లాండ్ గోల్ పోస్టు మీద కామెరూన్ ఆటగాళ్లు పదే పదే దాడి చేసినా… గోల్స్ మాత్రం కొట్టలేకపోయారు. అటు స్విట్లర్లాండ్ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కావడంతో… గోల్ నమోదు కాకుండానే ఫస్ట్ హాఫ్ ముగిసింది. రెండో అర్ధభాగం ప్రారంభమైన కాసేపటికే… 48వ నిమిషంలో బ్రీల్ ఎంబోలో గోల్ కొట్టడంతో… స్విట్జర్లాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక చివరిదాకా ఇరు జట్లు మరో గోల్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో… చివరికి 1-0 గోల్స్ తేడాతో కామెరూన్‌పై గెలిచింది… స్విట్జర్లాండ్. గెలిచినందుకు ఆ జట్టు ఆటగాళ్లు, ఫ్యాన్స్ సంబరాలు చేసుకోగా… గోల్ కొట్టి సొంత దేశాన్ని ఓడించిన బ్రీల్ ఎంబోలో, కామెరూన్ ఫ్యాన్స్ బాధతో ఉండిపోయారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×