BigTV English

MS Dhoni: ధోని క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!

MS Dhoni: ధోని క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!

MS Dhoni: క్రికెట్ ప్రపంచంలో మహేంద్రసింగ్ ధోని అనే పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ధోనీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ అనే పుస్తకంలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు ఈ కెప్టెన్ కూల్. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. తన ప్రతిభతో మహోన్నత శిఖరాలు అధిరోహించాడు. 2004వ సంవత్సరంలో ఓ అనామక క్రికెటర్ గా అడుగుపెట్టి.. అంచేలంచలుగా ఎదిగి నాయకుడి స్థాయికి ఎదిగిన క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని.. తన నాయకత్వంలో ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఎన్నో విజయాలను అందించాడు.


Also Read: Sanju Samson: ఐపీఎల్ 2025 పై సంజూ సంచలన నిర్ణయం!

చిన్నపిల్లల నుంచి యువత వరకు అందరికీ ధోని ఓ రోల్ మోడల్. ఓ సాధారణ రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ధోని ప్రస్థానం.. నేటి యువత అందరికీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ గా మహేంద్రసింగ్ ధోనీ ప్రస్థానం మొదలైంది. 23 డిసెంబర్ 2024న బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే తో తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు మహేంద్రసింగ్ ధోని. విధ్వంసకర బ్యాటింగ్ మాత్రమే కాదు ఎంత ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తును వేయగల నేర్పరితనం ధోని సొంతం.


తన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ లో మన దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్లాడు. ధోనిని స్ఫూర్తిగా తీసుకొని అనేకమంది క్రికెట్ లోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. అతను ఒక్కసారి మైదానంలో కనిపిస్తే చాలు అని కోరుకునే ప్రేక్షకులు కోట్లలోనే ఉన్నారు. ఇలాంటి స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి నేటికి 20 ఏళ్లు పూర్తయింది. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతూ తన ఆటతో ఎంతోమంది అభిమానులను అలరిస్తున్నాడు.

2007లో టి-20 ఫార్మాట్ కి ధోని కెప్టెన్ గా మారాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ స్థానంలో భారత జట్టు వన్డే కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఇక 2008లో అనిల్ కుంబ్లే స్థానంలో ధోని టెస్ట్ ఫార్మాట్ లో కూడా భారత కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ధోని ట్రాక్ రికార్డు చూస్తే.. తన కెరీర్ లో 90 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ధోని 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ 90 టెస్టుల్లో 256 క్యాచ్ లు, 38 స్టంప్ అవుట్ లు చేశాడు.

Also Read: America under-19 cricket: అమెరికా జట్టు కెప్టెన్ గా తెలుగమ్మాయి

ఇక 350 వన్డేలు ఆడిన ధోని.. 10, 773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డేలో 321 క్యాచ్ లు, 123 స్టంప్స్ చేశాడు. ఇక 98 టి-20 ల్లో 1, 617 పరుగులు రాబట్టాడు. ఇందులో 57 క్యాచ్ లు, 34 స్టంప్స్. ఇక ఐపీఎల్ కెరియర్ విషయానికి వేస్తే.. 361 మ్యాచ్ లు ఆడిన ధోని 7,167 పరుగులు చేశాడు. ఇందులో 207 క్యాచ్ లు, 84 స్టంప్స్ ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ని ఐదుసార్లు విజేతగా నిలిపాడు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×