BigTV English

Mumbai Indians:- ముంబై ఇండియన్స్‌‌తో జాగ్రత్త.. మ్యాచ్‌లను గెలిపిస్తున్న ఆ మూడు కారణాలు 

Mumbai Indians:- ముంబై ఇండియన్స్‌‌తో జాగ్రత్త.. మ్యాచ్‌లను గెలిపిస్తున్న ఆ మూడు కారణాలు 

Mumbai Indians:- ముంబై ఇండియన్స్‌కు ఉన్న అలవాటు.. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం. కాని, ఒక్కసారి గెలవడం స్టార్ట్ చేస్తే ఇక గెలుస్తూనే ఉంటుంది. ఎంత వరకూ అంటే టైటిల్ గెలిచే దాకా. అందుకే, ఇప్పటి వరకు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. దుమ్మురేపుతాడు అనుకున్న సూర్య కుమార్ యాదవ్ ఆడకపోయినా సరే, బూమ్రా-ఆర్చర్ లాంటి మేటి బౌలర్లు లేకపోయినా సరే.. ఆ మాటకొస్తే.. చెప్పుకోదగ్గ బౌలింగ్ టీమ్ లేకపోయినా సరే.. టిమ్ డేవిడ్ లాంటి గ్రేట్ ఫినిషర్ ఇంకా ఫామ్‌లోకి రాకపోయినా సరే.. ముంబై ఇండియన్స్ వరుస మ్యాచులు గెలుస్తోంది. ఎందుకని..?


1. రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్
ఓపెనర్లుగా ఈ ఇద్దరూ వస్తున్నారంటే భయపడాల్సిందే. పవర్ ప్లేలో వీళ్ల ధాటికి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరగడం లేదు. పైగా టాప్ బౌలర్స్‌ను సైతం చితకబాదుతుండడంతో.. మిగిలిన ఓవర్స్ వేయాల్సిన బౌలర్ల కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తున్నారు. స్ట్రైక్ రేట్ కూడా అదుర్స్. రోహిత్ శర్మ 150, ఇషాన్ కిషన్ 165. ఈ ఇద్దరి స్ట్రైక్ రేట్ కలిపినా సరే 158. సో, మ్యాచ్‌లను తమ వైపు తిప్పుకోవడంలో మేజర్ ఫ్యాక్టర్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డ్యుయోనే.

2. తిలక్ వర్మ ఫ్యాక్టర్
ద్వితీయ విఘ్నం అంటుంటారు. ఫస్ట్ ఐపీఎల్‌లో సత్తా చాటిన వాళ్లు రెండో ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కాని, తిలక్ వర్మ అలా కాదు. ఈ సీజన్‌లోనూ మెరుస్తున్నాడు. తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో మ్యాచ్ విన్నర్‌గానూ మారాడు. ఈ సీజన్‌లో టాప్-10 స్కోరర్స్‌లో తిలక్ వర్మ కూడా ఒకడు. మిడిల్ ఆర్డర్‌లో వస్తున్నా టాప్-10లో ఉన్నాడంటే ఎలా ఆడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. సో, ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్‌ను చూసి భయపడాల్సిన మరో కారణం తిలక్ వర్మ.


3. బౌలింగ్ అటాక్
ముంబై ఇండియన్స్‌కు ఇంప్రెసివ్ బౌలింగ్ టీమ్ అయితే కచ్చితంగా లేదు. సీనియర్ అయిన పీయుష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ తప్ప గొప్పగా బౌలింగ్ చేస్తున్న వాళ్లు కనిపించడం లేదు. కానీ, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ చేయడంలో ఇద్దరూ ఎక్సెప్షనల్. ఎదురుగా ఎంతటి మేటి బ్యాట్స్ మెన్ ఉన్నా సరే.. వీళ్ల బౌలింగ్ ఉచ్చులో పడాల్సిందే. ముంబై ఇండియన్స్ మ్యాచులు గెలుస్తోందంటే రీజన్ ఈ బౌలింగ్ కూడా.

సో, ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన కారణాలు ఈ మూడే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×