Travis Head: ఇటీవల భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) ఫైనల్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కీ ముందు మరో సిరీస్ కి సిద్ధమైంది ఆస్ట్రేలియా. ఈ మేరకు శ్రీలంకతో ఆస్ట్రేలియా జట్టు 2 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్, 3 వన్డేలు ఆడబోతోంది. ఈ క్రమంలో నేడు మొదటి టెస్ట్ ప్రారంభమైంది.
Also Read: Sehwag – Grey Divorce: ‘గ్రే’డివర్స్ అంటే ఏంటీ.. సెహ్వాగ్ తీసుకోబోయేది ఇలాంటి విడాకులేనా?
శ్రీలంకపై “గాలే” వేదికగా బుధవారం తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వగా.. స్టీవ్ స్మిత్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే భారత్ పై రాణించిన ట్రావీస్ హెడ్ ని ఈ టెస్ట్ సిరీస్ కి పరిగణలోకి తీసుకున్నారు సెలక్టర్లు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియాకు టెస్టులలో ఓపెనర్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే ట్రావీస్ హెడ్ ని ఓపెనర్ గా ప్రమోట్ చేశారు.
టీమిండియా పై బాక్సింగ్ డే టెస్టులో చక్కటి ప్రదర్శన కనబరచడంతో ఈ సిరీస్ లో అవకాశాన్ని దక్కించుకున్న హెడ్.. ఉస్మాన్ ఖవాజాతో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఈ తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్, మొదటి రోజు విధ్వంసం సృష్టించాడు హెడ్. లంకపై మెరుపు హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఎక్కడైనా, బ్యాటింగ్ ఆర్డర్ ఏ స్థానంలోనైనా.. తగ్గేదేలే.. అన్న విధంగా చెలరేగాడు.
35 బంతులలోనే హఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఆస్ట్రేలియాకి సూపర్ స్టార్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే ఫెర్నాడో బౌలింగ్ లో మూడు ఫోర్లు బాదాడు. మొత్తం 40 బంతులలో 10 ఫోర్లు, ఒక సిక్సర్ తో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగే హెడ్.. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Also Read: Steve Smith: టెస్టుల్లో స్మిత్ 10 వేల పరుగులు..ఈ లిస్టులో ఉన్న ప్లేయర్లు వీళ్లే !
ఉస్మాన్ ఖవాజా 137 బంతులలో 101 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మరో బ్యాట్స్మెన్ లబుషేన్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ స్టీవ్ స్మిత్ (57*), ఉస్మాన్ ఖవాజా (101*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, వండర్సయ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇప్పటికే డబ్ల్యూటీసి ఫైనల్ కి శ్రీలంక దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రదర్శనతో సొంత గడ్డపై మెరుగైన ప్రదర్శన చేసి కంగారుల విజయ యాత్రకు చెక్ పెట్టాలని భావించిన శ్రీలంకకు ఎదురు దెబ్బ తగిలింది.
Travis Head scored 57 (40) with 10 fours and a six while opening for Australia. 🙇♂️ pic.twitter.com/I4DPoSlAiM
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2025