BigTV English

Rohith Sharma : బాలీవుడ్ హీరోయిన్ పై మోజు పడుతున్న రోహిత్ శర్మ?

Rohith Sharma : బాలీవుడ్ హీరోయిన్ పై మోజు పడుతున్న రోహిత్ శర్మ?
Advertisement

Rohith Sharma :  సాధారణంగా క్రికెటర్ల కు బాలీవుడ్ నటీ, నటులకు అభినవ భావ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వారిలో కొంత మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొందరూ హీరోయిన్స్, మోడల్స్ ను పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకున్నారు. మరికొందరూ వారు అంటే తమకు ఇష్టం అని చెబుతుంటారు. ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్ అంటే తనకు ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గతంలో రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. అసలు ఇంతకు ఏ హీరోయిన్ ని రోహిత్ శర్మ ఇష్టపడ్డాడు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read :  Sanju Samson : 30 సిక్స్ లతో రెచ్చిపోయిన సంజూ…నో లుక్ షాట్ వైరల్

ఆ హీరోయిన్ అంటే క్రష్.. 


టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన కెరీర్ ప్రారంభంలో ఫిల్మ్ ఫేర్ అనే వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ లు తన అభిమాన నటులని.. హీారోయిన్లలో దీపికా పదుకొనే, విద్యాబాలన్  లు నటన ఇష్టమని చెప్పాడు. మరోవైపు కరీనా కపూర్ అంటే తనకు పిచ్చి అని.. ఆమె తన క్రష్ అని వెల్లడించాడు రోహిత్ శర్మ.  ఒకవేళ సినిమాల్లో నటించే అవకాశం కను వచ్చినట్టయితే.. కరీనా కపూర్ తో చేస్తానని తన మనస్సులో ఉన్న మాటను వెల్లడించాడు. వాస్తవానికి కరీనా అంటే తనకు ఎప్పుటి నుంచో క్రష్ ఉందని.. ఆమె డైహార్ట్ ఫ్యాన్ అని.. ఆమె సినిమాలు అన్నీ చూశానని వివరించాడు రోహిత్ శర్మ. 

రోహిత్ శర్మ రికార్డు.. 

రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. 2007లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. కెరీర్ ప్రారంభంలో అవకాశాలు రాగా కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. 2013 సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వరకు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. సచిన్ రిటైర్మెంట్ అయిన తరువాత టీమిండియా ఓపెనర్ గా రాణించి.. మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. వ్యక్తిగత టీమిండియా బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. దాదాపు 18 సంవత్సరాల నుంచి టీమిండియాలో కొనసాగుతున్నాడు. ఇటీవలే టెస్ట్, టీ-20 క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్ కి మాత్రమే పరిమితమయ్యాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు. గతంలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ వ్యవహరించి దాదాపు 5 టైటిల్స్ అందించాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ గా నియమించారు. ఐపీఎల్ తరువాత ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ తో భారత జట్టుతో చేరనున్నాడు. ఇటీవలే యోయో, బ్రాంకో టెస్టుల్లో పాస్ అయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ బరువు కూడా చాలా తొందరలో తగ్గడం విశేషం. 

 

Related News

IND VS AUS: బుమ్రాకు రెస్ట్‌, కుల్దీప్ ను ప‌క్క‌కు పెట్టారు…తొలి వ‌న్డేలో ఓట‌మికి 100 కార‌ణాలు

Womens World Cup 2025: నేడు శ్రీలంక‌, బంగ్లా మ‌ధ్య ఫైట్‌…టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జ‌రుగాల్సిందే?

INDW VS ENGW: స్టేడియంలో ఎక్కి ఎక్కి ఏడ్చిన‌ స్మృతి మందాన..ఫోటోలు వైర‌ల్‌

Ban On Pakistan: అఫ్ఘ‌నిస్తాన్ దెబ్బ అద‌ర్స్‌.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ ఔట్ ?

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్‌

Mitchell Starc: 176.5 కిమీ వేగంతో స్టార్క్ బౌలింగ్‌..షోయ‌బ్ అక్త‌ర్ 22 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

IND VS AUS: టీమిండియా కొంప‌ముంచిన వ‌రుణుడు..పెర్త్ లో ఆసీస్ విక్ట‌రీ

Big Stories

×