Sanju Samson : టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ వరుసగా కేరళ క్రికెట్ లీగ్ 2025లో రెచ్చి పోతున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా రెచ్చిపోయాడు. సంజు శాంసన్ ఓపెనర్ ఆడుతూ కేవలం ఇన్నింగ్స్ ల్లోనే 30 సిక్సర్లను బాదడం విశేషం. దీంతో ఆసియా కప్ 2025 కి ముందు సంజూ శాంసన్ ఓపెనింగ్ కు భీకర ఫామ్ కొనసాగించడం టీమిండియా కి శుభ సూచకమని చెప్పాలి. ముఖ్యంగా కేరళ క్రికెట్ టీ-20 లీగ్ లో సిక్సర్ల పిడుగుల్లా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే విధ్వంసకర శతకం సాధించాడు. 51 బంతుల్లో 121 పరుగులు చేయగా.. మరోవైపు 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అలాగే 37 బంతుల్లో 62 పరుగులు చేయడం విశేషం. తాజాగా మరో హాఫ్ సెంచరీ చేసి తన సత్తాను చాటాడు.
సంజూ శాంసన్ నో లుక్ సిక్సర్..
ముఖ్యంగా అలెప్పీ రిపిల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కేవలం 41 బంతుల్లోనే 9 సిక్సర్లు, 2 పోర్లు కొట్టి మొత్తం 83 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో మొత్తం ఇప్పటివరకు 30 సిక్సర్లు బాదాడు సంజు శాంసన్. ఇక ఇతని జోరు చూస్తుంటే.. ఆసియా కప్ లో ప్రత్యర్థి పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తాడనిపిస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహమ్మద్ ఇవాన్ వేసిన ఓ బంతిని నో లుక్స్ సిక్సర్ గా మలిచడం విశేషం. మరోవైపు సంజూ శాంసన్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే.. టీమిండియా కి మరో విధ్వంసకర ఓపెనర్ దొరికాడు అనే చెప్పవచ్చు. వాస్తవానికి ఆసియా కప్ 2025 టీమ్ ను ప్రకటించిన ప్రారంభంలో సంజూ శాంసన్ బ్యాటింగ్ లో ఓపెనింగ్ వస్తాడా..? అసలు తుది జట్టులో స్థానం ఉంటుందా..? అనే వాదనలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఫామ్ చూస్తుంటే సంజూ ను ఓపెనింగ్ ని పంపించడమే బెటర్ అని కొందరూ పేర్కొనడం గమనార్హం.
శాంసన్ సిక్సర్ల మోత..
అలెప్పీ రిపిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా సంజూ శాంసన్ సిక్సర్లతో మోత మ్రోగించాడు. ఈ మ్యాచ్ లో తొలుత అలెప్పీ రిపిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. వీటిలో ఓపెనర్, కెప్టెన్, వికెట్ కీపర్ అజహారుద్దీన్ 43 బంతుల్లో 63 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జలాజ్ సక్సెనా 42 బంతుల్లో 71 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అభిషేక్ నాయర్ 24, అక్షయ్ 04, మొహమ్మద్ ఈనన్ 0, మహమ్మద్ కైఫ్ 1, అరుణ్ 0, శ్రీరూప్ 8 పరుగులు చేశారు. 20 ఓవర్లలో 176/6 పరుగులు సాధించారు. 177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కేరళ బ్లూ టైగర్స్ జట్టు ఓపెనర్ సంజు శాంసన్ 41 బంతుల్లో 83, వినూప్ మనోహరన్ 11 బంతుల్లో 23 పరుగులు చేశారు. నిఖిల్ 18, అజీష్ 18, సాలీ శాంసన్ 1, జోబి్ 1, జెరిన్ 25, అఫ్రద్ నజర్ 3 పరుగులు చేయడంతో 18.2 ఓవర్లలో 178/7 పరుగులు చేశారు. దీంతో సంజూ శాంసన్ అన్న సాలీ శాంసన్ కెప్టెన్ వ్యవహరించిన కేరళ బ్లూ టైగర్స్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Clean, crisp, classy. Sanju Samson with another cracking knock! 👏
83 off 41 laced with NINE sixes! pic.twitter.com/WZj0gWuNyd
— Cricbuzz (@cricbuzz) August 31, 2025