BigTV English

Boxing Day Test: బాక్సింగ్ డే పేరు ఎలా వచ్చింది? క్రికెట్ కు బాక్సింగ్ కు ఏం సంబంధం?

Boxing Day Test: బాక్సింగ్ డే పేరు ఎలా వచ్చింది? క్రికెట్ కు బాక్సింగ్ కు ఏం సంబంధం?

Boxing Day Test: ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు జరగగా.. ఇరుజట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. మరొక టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఇక నాలుగో టెస్ట్ మేల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 గురువారం నుండి ప్రారంభం కాబోతోంది. మేల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ బాక్సింగ్ డే లో గెలిచి సిరీస్ లో ఆధిపత్యం చలాయించాలని ఇరుజట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.


Also Read: Vinod Kambli: ఆస్పత్రి బెడ్ పై ఎమర్జెన్సీ వైద్యం.. పాట పాడిన టీమిండియా ప్లేయర్?

అయితే సాధారణంగా జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ ని బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు..? అసలు బాక్సింగ్ కి క్రికెట్ కి సంబంధం ఏంటి..? ఈ పేరు ఎలా వచ్చింది..? అనే వివరాలలోకి వెళితే.. క్రిస్మస్ తరువాత జరిగే టెస్ట్ మ్యాచ్ కి బాక్సింగ్ డే అని పేరు పెట్టారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి చాలా దేశాలలో బాక్సింగ్ డే అంటే ప్రభుత్వ సెలవు దినం. క్రిస్మస్ తో పాటు మరుసటి రోజు యజమానులు, ధనిక కుటుంబాలు తమ ఉద్యోగులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి బహుమతులు ఇచ్చే సందర్భం ఇది.


ఈ క్రిస్మస్ వేడుకలు తరువాత రోజు కృతజ్ఞతలు తెలియజేయడానికి, మంచి సంకల్పాన్ని వ్యాప్తి చేయడానికి ఇదొక మార్గంగా కొనసాగుతోంది. ఈ బాక్సింగ్ డే ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం ప్రసిద్ధ మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు కూడా ఈ రోజున టెస్ట్ మ్యాచ్ ని ఆడడం ప్రారంభించాయి. ఈ సాంప్రదాయం ఆస్ట్రేలియాలో 1950లో ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగినప్పుడు ప్రారంభమైంది.

అప్పటినుండి ఇది క్రికెట్ క్యాలెండర్ లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బిగ్ ఈవెంట్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది హాజరయ్యే క్రికెట్ మ్యాచ్ లలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ 26వ తేదీన ఉదయం ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మొదటి రోజుకి సంబంధించిన టికెట్స్ మొత్తం ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ బాక్సింగ్ డే టెస్ట్ కేవలం మ్యాచ్ కాదు.. ఇది క్రికెట్, సంస్కృతి, పండుగ వేడుకల కలయిక. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఒక ప్రత్యేకమైన ఈవెంట్. అందుకే డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ లను బాక్సింగ్ డేట్ టెస్ట్ అని పిలుస్తారు.

Also Read: Ben Stokes Injury: ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ జట్టు నుంచి ఔట్

ఇక గురువారం నుండి జరిగే ఈ బాక్సింగ్ టెస్ట్ కి ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. స్కాట్ బోలాండ్ కి ఈ తుదిజట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. నాథన్ మెక్ స్వీనీ స్థానంలో శామ్ కాన్స్టాస్ కి జట్టులో చోటు దక్కింది. ఇక గాయంతో సిరీస్ కి దూరమైన జోష్ హెజిల్ వుడ్ స్థానంలో బోలాండ్ కి చోటు కల్పించినట్లు కెప్టెన్ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారి (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, శామ్ కాన్స్టాస్, మార్నాస్ లాబుచగ్నే, ట్రావీస్ హెడ్, విచ్ మార్ష్, అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లియాస్, స్కాట్ బోలాండ్.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×