Balagam Venu New Movie: కొందరు హీరోయిన్లు ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా.. దానివల్ల తమకు ఎంత పాపులారిటీ వస్తుంది అని అనుకున్నా.. అందులో తమ పాత్రకు ప్రాధాన్యత లేదు అనిపిస్తే మాత్రం రిజెక్ట్ చేయడానికి కొంచెం కూడా ఆలోచించరు. అలాంటి నటీమణులు ఎక్కువ సినిమాలు చేసినా చేయకపోయినా వారి క్యారెక్టర్‌తో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఇప్పుడు సాయి పల్లవి చేతిలోకి మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. సాయి పల్లవిని మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఎదురయ్యింది.
‘అమరన్’ తర్వాత
సాయి పల్లవి ఏడాదికి ఒకసారి కూడా వెండితెరపై చూస్తామనే గ్యారెంటీ లేదు. అలాంటి తను ఒక్క సినిమాలో నటించిందంటే కచ్చితంగా తన నటనతో భారీ ఇంపాక్టే క్రియేట్ చేస్తుంది. తను ఒక సినిమాను సెలక్ట్ చేసిందంటే కచ్చితంగా అందులో చాలామంది ప్రేక్షకులకు నచ్చే అంశం ఏదో ఉందని చాలామంది నమ్ముతారు. సినిమా హిట్ అయినా అవ్వకపోయినా తన నటన మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. చివరిగా శివకార్తికేయన్‌తో కలిసి ‘అమరన్’ అనే మూవీలో నటించిన సాయి పల్లవి.. ఇప్పుడు ఒక తెలుగు ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్టు తెలుస్తోంది. తన దర్శకత్వం వహించే తరువాతి సినిమా ‘ఎలమ్మ’ కోసం ఈ హైబ్రిడ్ పిల్లను ఒప్పించాడట బలగం వేణు (Balagam Venu).
Also Read: 11 మందితో ఎఫైర్స్.. పెళ్లి చేసుకున్నా రెండేళ్లే.. ఈ స్టార్ హీరోయిన్ లైఫ్ గురించి తెలుసా..?
కల్చర్‌పై సినిమా
‘బలగం’ మూవీతో తనలో కామెడియన్ మాత్రమే కాదు.. ఒక దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు వేణు. అప్పటినుండి వేణు తరువాతి సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అప్పుడే తను ఇప్పటినుండి తెరకెక్కించే సినిమాలు చాలావరకు తెలంగాణ కల్చర్‌కు అద్దంపట్టేలాగానే ఉంటాయని వేణు మాటిచ్చాడు. కొన్నిరోజుల క్రితం తన తరువాతి సినిమా టైటిల్ ‘ఎల్లమ్మ’ (Yellamma) అని కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా కోసం సరైన హీరో దొరకక ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇప్పుడు హీరో, హీరోయిన్.. ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. ఇక ‘ఎల్లమ్మ’ మూవీ సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యమని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
మరోసారి అదే పాత్రలో
‘ఎల్లమ్మ’ కథ చాలామంది హీరోలకు వినిపించాడట బలగం వేణు. చివరిగా ఈ కథకు నితిన్ (Nithiin) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరో ఓకే.. మరి హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్‌కు ఇన్నాళ్లకు తెరపడింది. ‘ఎల్లమ్మ’లో నితిన్‌కు జోడీగా సాయి పల్లవి నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ అమ్మాయిగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది సాయి పల్లవి. తెలుగులో తన మొదటి సినిమా అయిన ‘ఫిదా’లో కూడా సాయి పల్లవి (Sai Pallavi) ఒక తెలంగాణ అమ్మాయిగా చాలా నేచురల్‌గా నటించింది. ఇప్పుడు మరోసారి తనను అలాంటి పాత్రలో చూడడానికి ఆడియన్స్ ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. ఈ మూవీపై మరిన్ని అప్డేట్స్ త్వరలోనే బయటికి రానున్నాయి.