IND vs AUS 4th Test: మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో 311/6 ఓవర్ నైట్ స్కోర్ తో రెండవ రోజు అటను ప్రారంభించింది ఆస్ట్రేలియా జట్టు. అరంగేట్రం ఓపెనర్ బ్యాటర్ సామ్ కాన్ స్టాస్ తుఫాన్ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. మిగతా బ్యాటర్లు ఆస్ట్రేలియా జట్టును 500 కు చేరువ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కానీ భారత బౌలర్లు అడపాదడపా వికెట్లు పడగొడుతూ ఆస్ట్రేలియా జట్టును 500 లోపే ఆల్ అవుట్ చేశారు.
Also Read: Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. జోకర్ అంటూ ఆసీస్ రచ్చ !
స్టీవ్ స్మిత్ 197 బంతులలో 13 ఫోర్లు, మూడు సిక్సులతో 140 పరుగులు చేశాడు. ఇక మరో ఆటగాడు ఉస్మాన్ ఖవాజా 121 బంతుల్లో 6 ఫోర్లు బాది 57 పరుగులు, లబుషేన్ 145 బంతుల్లో ఏడు ఫోర్లతో 72 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగుల స్కోర్ చేసింది. ఇక భారత బౌలర్లలో స్టార్ పేసర్ బూమ్రా 4, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 3, ఆకాష్ దీప్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. మరో బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు.
కానీ పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు. 23 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 122 పరుగులు ఇచ్చి తన కెరీర్ లోనే అత్యంత చెత్త రికార్డ్ ని నమోదు చేసుకున్నాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన భారత జట్టుకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనింగ్ కి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి కాసేపు క్రీజ్ లో పాతుకుపోయాడు.
కేఎల్ రాహుల్ ని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమీన్స్ అద్భుతమైన బంతివేసి క్లీన్ బోల్డ్ చేశాడు. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడుతూ 82 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి జైష్వాల్ ఆస్ట్రేలియా బౌలర్లను ఇబ్బంది పెడుతూ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్ లో జైష్వాల్ – విరాట్ కోహ్లీ మధ్య చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల జైస్వాల్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇక విరాట్ కోహ్లీ ఎప్పటిలానే మరోసారి తన బలహీనతకే పెవిలియన్ బాట పట్టాడు. 86 బంతుల్లో 36 పరుగులు చేసిన కోహ్లీ బోలాండ్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని కదిలించి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. అనంతరం నైట్ వాచ్ మెన్ గా వచ్చిన ఆకాష్ దీప్ బోలాండ్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు.
Also Read: Virat Kohli: బాక్సింగ్ టెస్టులో కలకలం..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడు..!
దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 46 ఓవర్లలో 164 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (6*), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (4*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమీన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారత జట్టు ఇంకా 310 పరుగుల వెనకంజలో ఉంది. ఫాలో ఆన్ ను తప్పించుకోవాలంటే ఇంకా 111 పరుగులు చేయాలి.