Under 19 World Cup 2026: అండర్ 19 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Under 19 World Cup 2026 ) భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా అండర్ 19 టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( India U19 vs Bangladesh U19, 7th Match ) జట్ల మధ్య ఏడవ మ్యాచ్ నిర్వహించనున్నారు. జింబాబ్వేలోని బులవాయే క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ( Queens Sports Club, Bulawayo ) వేదికగా ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్’ ( Boycott ) అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు ఇండియన్ ఫాన్స్. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ టీమ్ ఇండియా అస్సలు ఆడకూడదని కోరుతున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని.. దానికి నిరసనగా బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలా కాదని బంగ్లాదేశ్ తో ఆడితే, ఇండియా పరువు పోవడం గ్యారంటీ అంటున్నారు. హిందువులపై దాడులు చేసే జట్టుతో క్రికెట్ ఆడటం అవసరమా ? అని నిలదీస్తున్నారు. దీనిపై బీసీసీఐ వెంటేనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు.
ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య రోజుకు గొడవలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది హిందువులు అన్యాయంగా మరణించారు. హిందువులు ఉన్న ఇండ్లపై బంగ్లాదేశ్ ముస్లింలు దాడులు చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. బంగ్లాదేశ్ లో అసలు హిందువులకు రక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. దీంతో ముస్తాఫిజుర్ రహమాన్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ప్రసారాలపై తమ దేశంలో బంగ్లాదేశ్ బ్యాన్ వేసింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇండియాలో పర్యటించబోమని కూడా బంగ్లాదేశ్ వెల్లడిస్తోంది. ఈ తరుణంలోనే అండర్ 19 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా బంగ్లాదేశ్ తో ఇప్పుడు మ్యాచ్ ఆడకుండా బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇండియన్ ఫాన్స్.
భారత U19 జట్టు: ఆయుష్ మ్హత్రే (c), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), కనిష్క్ చౌహాన్, హర్వాన్ష్ పంగాలియా, RS అంబరీష్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్.
బంగ్లాదేశ్ U19 స్క్వాడ్: జవాద్ అబ్రార్, MD రిఫత్ బేగ్, Md అజీజుల్ హకీమ్ తమీమ్(c), కలాం సిద్దికి అలీన్, Md రిజాన్ హోసన్, Md ఫరీద్ హసన్ ఫైసల్(w), ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, షేక్ పావేజ్ జిబోన్, Md సమియున్ బసీర్ రదుల్, ఇస్లాం ఇస్లామ్ Md అబ్దుల్లా.
இந்தியா – வங்காளதேசம் அணிகள் மோதல்#indvsban #india #bangladesh #worldcup2026 #newsj pic.twitter.com/cQ7hLKohMb
— NewsJ (@NewsJTamil) January 17, 2026