BigTV English

Ram Charan: 2023 వన్డే వరల్డ్ కప్ తో.. రామ్ చ​రణ్

Ram Charan: 2023 వన్డే వరల్డ్ కప్ తో.. రామ్ చ​రణ్

Indian Cricket Fans Tell Hero Ram Charan As He Poses With ODI World Cup 2023:  ఏమిటి? ఇదని ఆశ్చర్యపోతున్నారా? అదేం లేదండీ.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం మెల్ బోర్న్ లో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న 15వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ముఖ్య అతిథిగా వెళ్లాడు. అయితే టాలీవుడ్ నుంచి తనొక్కడికే ఆహ్వానం అందింది. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా 2023లో ఆస్ట్రేలియా గెలిచిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శనగా ఉంచారు.


అయితే హీరో రామ్ చ​రణ్, భార్య ఉపాసన ఇద్దరూ ఫెస్టివల్ కి వెళుతూ అక్కడ పెట్టిన ప్రపంచకప్ ను చరణ్ ఆప్యాయంగా పట్టుకున్నాడు. అయ్యో మనకి రావల్సింది. ఇక్కడ ఉందా? అన్నట్టు ఆయన చూసిన చూపులు చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీతో రామ్‌చ‌ర‌ణ్ ఫోటోల‌కు ఫోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి

ఎందుకొచ్చిన గొడవన్నయ్యా.. పట్టుకొచ్చేయ్.. అని పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్లు రాశారు. అయితే రాంచరణ్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిస్తుంటే.. పక్కనే ఉన్న ఉపాసన ఆగమని సముదాయిస్తూ కనిపించింది. ఎందుకంటే వాటిని మరి పట్టుకోవచ్చునో తెలీదు, కానీ రామ్ చ​రణ్ మాత్రం ఆ ట్రోఫీని చూసి సగటు క్రికెట్ ప్రేమికుడిలా మారిపోయాడు.


Also Read: ఎప్పటికైనా నిజం గెలవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా: రెజ్లర్‌ వినేష్‌

ప్రపంచకప్ ని ఎంతో తన్మయత్వంతో చూసి, పట్టుకుని చూశాడు. మొత్తానికి టీమ్ ఇండియాకి కప్ రాకపోయినా, మన రాంచరణ్ ఆస్ట్రేలియా వెళ్లి మరీ ప్రపంచకప్ చూసొచ్చాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. అతి త్వరలోనే విడుదలకు రెడీ కానుంది. ఈ సినిమాకు దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఇకపోతే డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన భారతీయుడు-2 మిశ్రమ ఫలితాలనిచ్చింది. మరి ఆ సినిమా ప్రభావం దీనిపై ఉంటుందా? లేదా? అనేది చూడాలి.

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ నుంచి రాంచరణ్ వచ్చిన తర్వాత బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాలో న‌టించ‌నున్నాడు. ఆర్సీ16 వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

Related News

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Big Stories

×