Viral News: సాధారణంగా సుదూర ప్రయాణాలకు వెళ్లి వచ్చిన వారికి షాకిస్తారు దొంగలు. ఎవరూ లేని సమయం చూసి, మాటువేసి చోరీలకు పాల్పడుతుంటారు దొంగలు. ఇటీవల దొంగల్లో కూడ చిలిపి చోరులు తయారయ్యారు. కొందరు చోరీ చేసి అక్కడే నిద్రపోవడం, మరికొందరు చోరీ చేసిన ఇంట్లోనే మద్యం త్రాగి అక్కడే పడిపోవడం ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇలా ఎవరూ లేని ఇంట్లోకి జొరబడి చోరీ చేసే దొంగలకు ఓ ఇంటి యజమాని భారీ షాకిచ్చాడు. అది కూడ అలా ఇలా కాదు.. దిమ్మతిరిగేలా చేశాడు.
సంక్రాంతి అంటేనే సంబరాలను తీసుకువచ్చే పండుగ. ఈ పండుగకు అందరూ స్వగ్రామాలకు వెళ్తారు. అది కూడ సంక్రాంతి పండుగకు పది రోజులు పాఠశాలలకు సెలవులు కావడంతో, ఎక్కువ రోజులు స్వగ్రామంలో ఉండేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. స్వగ్రామాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందంటూ పోలీసులు ముందుగానే ప్రజలను హెచ్చరించారు. అయితే ఇక్కడే ఓ ఇంటి యజమాని వినూత్న రీతిలో ఆలోచించి దొంగలకు షాకిచ్చాడు.
Also Read: Telangana Govt: ఏపీలో మొండిచేయి.. తెలంగాణలో ఆ పథకానికి శ్రీకారం.. డోంట్ మిస్!
ఏ జిల్లాలో జరిగిందో కానీ ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్తున్న ఇంటి యజమాని, తన ఇంటి ద్వారంపై దొంగలకు ఓ లేఖ రాసి అంటించారు. మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలు తీసుకొని కూడా వెళ్తున్నాం.. మా ఇంటికి ఎవరూ రావద్దు.. ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ ఓ లేఖ రాసి అంటించడం విశేషం. ఈ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, దొంగలకే షాకిచ్చిన యజమాని అంటూ నెటిజెన్లు అభినందనలు తెలుపుతున్నారు.