Mumbai Indians IPL Points| ముంబై ఇండియన్స్ జట్టు బుధవారం మే 21, 2025న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబయి జట్టు ఐపిఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు చేరిన చివరి జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ముంబై.. టాప్ ప్లేస్‌కు కూడా చేరే అవకాశం ఉంది.
ఢిల్లీ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ మెరుపులు..
సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆటతీరు కనబర్చాడు. కేవలం 43 బంతుల్లోనే 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో నమన్ ధీర్.. 8 బంతుల్లో 24 పరుగులు (2 సిక్సులు, 2 ఫోర్లు) చేయడంతో ముంబయి 180 పరుగుల సురక్షిత స్కోర్ చేసింది.
బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్ (3/11), జస్ప్రిత్ బుమ్రా (3/12) కలిసి 6 వికెట్లు తీసి డిల్లీ జట్టును కేవలం 121 పరుగులకే ఆలౌట్ చేశారు. కేవలం 18.2 ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని ఆలౌట్ అయింది.
హార్దిక్ పాండ్యా ప్రశంసలు
మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. బుమ్రా మరియు సాంట్నర్ బౌలింగ్ నైపుణ్యం తన కెప్టెన్సీ బాధ్యతలను సులభతరం చేస్తోందని చెప్పాడు. “వాళ్లిద్దరూ చాలా నియంత్రణతో బౌలింగ్ చేస్తారు. ఎప్పుడైనా బంతిని వారికివచ్చ,” అని అన్నాడు. అలాగే, సూర్యకుమార్, నమన్ చివర్లో ఎలా ఆడారో చూసి చాలా థ్రిల్ ఫీలయ్యానని చెప్పాడు. “160 స్కోరు వచ్చినా చాలు అని అనుకున్నా. కానీ వీళ్లిద్దరూ 180కి తీసుకెళ్లారు, అది మేం ఊహించలేదు” అని అన్నాడు.
డిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు దూరం
ఇటు డిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది. జట్టు తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ఈ సీజన్ డిల్లీ జట్టు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏదో ఒకదానిలో స్థిరత లేకపోవడం వల్లే ఓడిపోయిందని అభిప్రాయపడ్డాడు. “సీజన్ మొత్తంలో 6-7 గేముల్లో ఏదో ఒక విభాగంలో ఆటతీరు సరిగా చూపించలేక (perform లేకుండా)పోయాం. ఐపిఎల్ టాప్ 4 టీమ్స్ లో ఉండాలంటే రెండు విభాగాల్లోనూ కూడా స్థిరత అవసరం,” అని డుప్లెసిస్ అన్నారు.
Also Read: ధోనికి మరో ఘోర అవమానం…స్టంప్స్ నుంచి సిక్సులు అన్ని ఫిక్సింగ్ అంటూ!
ఇంకా, యువ ఆటగాడు రిజ్విలో ప్రతిభ ఉందని చెప్పారు. “పవర్‌ఫుల్ జట్టు అయిన ముంబయిని ఎదుర్కోవాలంటే, ప్రతీ ఓవర్‌లో జాగ్రత్తగా ఆడాలి. కానీ చివరి రెండు ఓవర్లలో మా బౌలింగ్ సాధారణంగా నిలిచింది,” అని డు ప్లెసిస్ ఓటమి అంగీకరించాడు.
ముంబయికి టాప్ స్థానం అవకాశముంది
ప్రస్తుతం ముంబై నాలుగో స్థానంలో ఉన్నా, పంజాబ్ కింగ్స్‌పై గెలిచాక ఇంకా పై స్థానానికి చేరుకుంటుంది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మిగతా మ్యాచ్‌లను ఒకవేళ ఓడిపోతే.. టేబుల్ టాపర్ గా ముంబై వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా జట్లలో ఇప్పుడు గుజరాత్, ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో టాప్ 2 లో ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ ఇప్పటికీ రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నా.. 18 పాయింట్లతో టాప్ లో ఉంది. కానీ ఆర్సీబీ మాత్రం చివరగా ఆడిన అయిదు మ్యాచ్ లలో నాలుగింటిలో విజయం సాధించి.. మంచి ట్రాక్ కొనసాగిస్తోంది. ఈ రెండు టీమ్లతో పోలిస్తే.. పంజాబ్, ముంబై మూడు నాలుగో స్థానాల్లోనే నిలిచి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అన్ని మ్యాచ్ లు ముగిసేదాకా టేబుల్ టాపర్ ఎవరు అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.