Miss World Contestants: ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్‌లోని శిల్పారామాన్ని సందర్శించారు. ఇప్పటికే రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదగిరి గుట్ట, రామోజీ ఫిల్మ్‌సిటీ, భూదాన్ పోచంపల్లి, పిల్లలమర్రి వంటి ప్రముఖ ప్రాంతాల్లో పర్యటించారు ముద్దుగుమ్మలు. ఈ కార్యక్రమం బుధవారం రాత్రే జరగాల్సి ఉన్నా.. వర్షం వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. ఈ రోజు సరూర్‌నగర్‌లోని విక్టోరియా మోమెరియల్‌హోమ్‌ని సందర్శించనున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వరల్డ్ లైబ్రరీని ప్రారంభించనున్నారు.
మాదాపూర్ శిల్పా కళావేదికలో సాయంత్రం 7 గంటల నుంచి టాలెంట్ ఛాలెంజ్ ఫైనల్ నిర్వహించనున్నారు. దీనికి 24 మంది అర్హత సాధించగా మిస్ వరల్డ్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి నిర్వహిస్తున్నాయి. ప్రపంచానికి తెలంగాణ పర్యాటకాన్ని పరిచయం చేయడం కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన పలు సందర్శనీయ ప్రాంతాలను పర్యటిస్తున్నారు సుందరీమణులు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం పోటీలకు మాత్రమే కంటెస్టెంట్లు పరిమితం కాకుండా టూరిజం డెవలప్ మెంట్ కు ప్రణాళికలు రెడీ చేశారు. అన్నట్లుగానే పోటీదారులను రెండు గ్రూప్ లుగా విభజించి.. రోజుకో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఇటీవల ఓ గ్రూప్ ను నాగార్జున సాగర్ తీసుకెళ్లారు. చార్మినార్ వీధుల్లో హెరిటేజ్ వాక్ కు చేయించారు. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న వేదిక వద్ద నుంచి తెలంగాణ జరూర్ ఆనా అని డెకొరేట్ చేసిన ఏసీ బస్సుల్లో చార్మినార్ వద్దకు తీసుకొచ్చి.. పాత బస్తీలో ప్రసిద్ది చెందిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలకడం, ఆ తర్వాత ఫోటో షూట్, హెరిటేజ్ వాక్, డిన్నర్ ఏర్పాట్లు చేశారు.
చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ అనంతరం అందాల పోటీదారులు ఇక్కడ షాపింగ్ చేశారు. లాడ్ బజార్ లో ఎంపిక చేసిన తొమ్మిది షాపుల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు వంటి డెకొరేటివ్ వస్తువుల షాపింగ్ తో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. చివరగా చారిత్రక కట్టడం చౌమహల్లా ప్యాలెస్ కు వెళ్లడం, ఇదే ప్యాలెస్ లోనే మిస్ వరల్డ్ సుందరీమణులకు మెహందీ వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు GHMC బాగా శ్రమించింది. స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుతో పాటు తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ, బీటీ రోడ్లు, డివైడర్ల రిపేర్లు చేయించారు. దాదాపు 250 మంది కార్మికులు పారిశుధ్య పనుల్లో పాలుపంచుకున్నారు. సో ఈ మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు గ్లోబల్ అటెన్షన్ సాధించడం, ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా చేయడం మెయిన్ టార్గెట్ గా ఉన్నాయి. ప్రపంచదేశాలకు తెలంగాణ టూరిస్ట్ స్పాట్లను పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read: ఆ పని చేసుంటే 17 మంది బతికేవారా? గుల్జార్‌హౌజ్ డెత్ మిస్టరీ రివీల్స్
2024లో 1,55,113 మంది ఫారిన్ టూరిస్టులు తెలంగాణను విజిట్ చేశారు. తాజా మిస్ వరల్డ్ పోటీలతో ఈ నెంబర్ మరింత పెరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో టూరిజం వృద్ధి ద్వారా హోటళ్లు, ట్రాన్స్ పోర్టేషన్, గైడ్ సేవలు, స్థానిక కళాకారులు, చిన్న వ్యాపారాలకు ఆదాయం పెరుగుతుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో ప్రపంచ దృష్టిలో నిలపడం ద్వారా తెలంగాణ ఒక మల్టీ-డైమెన్షనల్ టూరిజం హబ్ గా గుర్తింపు పొందుతుంది. అలాగే టూరిజం, పెట్టుబడుల బూస్టప్ ద్వారా రాష్ట్ర జీడీపీలో స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. సో మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో కేవలం ఒక అందాల పోటీ మాత్రమే కాదు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను బలోపేతం చేసే, పెట్టుబడులను ఆకర్షించే, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే సువర్ణావకాశంగా చూస్తోంది.