Hardik Pandya Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో గురువారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Mumbai Indians vs Rajasthan Royals ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసింది ముంబై ఇండియన్స్. ఏకంగా 100 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా ( Hardik Pandya) గురించి ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది. హార్దిక్ పాండ్యా కంటికి ఏడు కుట్లు పడ్డాయని తెలుస్తోంది. అయినప్పటికీ మ్యాచ్ ఆడి ఈ జట్టును గెలిపించాడు హార్దిక్ పాండ్యా.
Also Read: Rohit Sharma – DRS: ముంబై మ్యాచ్ ఫిక్సింగ్.. అడ్డంగా దొరికిపోయిన రోహిత్.. రాజస్థాన్ ఎలిమినేట్
కంటి పైన ఏడు కుట్లు… రియల్ హీరో హార్దిక్ పాండ్యా
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో… హార్దిక్ పాండ్యా ఇంజురీ విషయం బయటకు వచ్చింది. బంతి తగలడంతో కంటి పైన… తీవ్రమైన గాయమైందని సమాచారం అందుతుంది. అయితే.. గాయం అయితే డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని ఓ మ్యాచ్ ఆడకుండా రెస్ట్ తీసుకోవాలి. కానీ రియల్ హీరో హార్దిక్ పాండ్యా మాత్రం అలా చేయలేదు. కంటి పైన ఏడు కుట్లు వేసుకొని…. మ్యాచ్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ పై… జట్టును గెలిపించాడు హార్థిక్ పాండ్యా. అయితే తన కంటికి అయిన ఇంజురీని కనిపించకుండా.. స్పెట్స్ పెట్టాడు హార్థిక్ పాండ్యా.
ఇది ఇలా ఉండగా… రాజస్థాన్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా స్పెట్స్ పెట్టుకోవడంతో… స్టైల్ కోసం అలా పెట్టుకున్నాడని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ చేస్తున్నాడని కూడా మండిపడ్డారు. అయితే అసలు వాస్తవం మాత్రం అది కాదు. అతనికి ఏడు కుట్లు పడడంతో… కంటి స్పెట్స్ పెట్టుకొని మరీ తన గాయాన్ని కవర్ చేశాడు హార్థిక్ పాండ్యా. ఈ విషయం తెలియక చాలామంది హార్థిక్ పాండ్యాను ట్రోలింగ్ చేశారని తెలుస్తోంది.
రాజస్థాన్ ను ఇంటికి పంపించిన ముంబై
గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 11 మ్యాచ్లో మూడు మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించడంతో… రాజస్థాన్ రాయల్స్ ఇంటి దారి పట్టింది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట ఎలిమినేట్ అయింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కూడా ఇంటి దారి పట్టడం జరిగింది. ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కూడా ఉంది. ఇందులో ఓడిపోతే హైదరాబాద్ కూడా ఇంటి దారి పట్టడం ఖాయం.
Also Read: SRH Team Maldives trip : కలసి ఉంటే కలదు సుఖం… తెలుగు హీరో అయిపోయిన ప్యాట్ కమిన్స్
Captain Hardik Pandya played today with seven stitches above his left eye.
No he won’t use paid PR like some in the team, to make noise about it and seek sympathy. https://t.co/1eb6LDLwRG pic.twitter.com/dFCYux9SMV
— CRICKET WHISPERS 🔥 (@CricketWips) May 1, 2025