Rohit Sharma – DRS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో.. మరోసారి ముంబై ఇండియన్స్ జటుపై మ్యాచ్ ఫిక్సింగ్ ( Match Fixing ) ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma )… టైం అయిపోయిన కూడా DRS వాడుకోవడంతో…. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య… గురువారం రోజున మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్ ఏకంగా 100 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
Also Read: SRH Team Maldives trip : కలసి ఉంటే కలదు సుఖం… తెలుగు హీరో అయిపోయిన ప్యాట్ కమిన్స్
ముంబై ఇండియన్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి… 217 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… ఎల్ బి డబ్ల్యూ అయ్యాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగులు మాత్రమే. ఎల్ బి డబ్ల్యు కాగానే అవుట్ అని డిసైడ్ అయ్యాడు రోహిత్ శర్మ. కానీ ఏమైందో తెలియదు కానీ DRS టైం పూర్తయిన తర్వాత… రివ్యూ తీసుకున్నాడు. వాస్తవానికి టైమింగ్ అయిపోయిన… తర్వాత ఏ ప్లేయర్ కు కూడా అవకాశం ఉండదు. కానీ రోహిత్ శర్మ టైం అయిపోయిన తర్వాత డీఆర్ఎస్ కోరాడు.
అంపైర్లు…కాదనకుండా వెంటనే థర్డ్ అంపైర్ కు ఇచ్చారు. అయితే ఆ రివ్యూ లో కూడా… బంతి… వికెట్లకు సమానంగానే పిచ్ అయింది. దీంతో అవుట్ అయిపోయానని రోహిత్ శర్మ కూడా చాలా నిరాశ చెందాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం దాన్ని అవుట్ గా ప్రకటించకుండా… నాట్ అవుట్ ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్లో 36 బంతుల్లోనే 53 పరుగులు చేసి రాజస్థాన్ ను దెబ్బతీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని క్రికెట్ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.
అంబానీ విమర్శలు
రోహిత్ శర్మ వివాదం ( Rohit Sharma DRS ) నేపథ్యంలో…. ముఖేష్ అంబానీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా టోర్నమెంట్ గెలవాలని ముఖేష్ అంబానీ కంకణం కట్టుకున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. దానికోసం అంపైర్లు, థర్డ్ అంపైర్లు ఇలా అందరిని ముఖేష్ అంబానీ కొనుగోలు చేశాడని సంచలన కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. 11 మ్యాచ్ లాడిన రాజస్థాన్ రాయల్స్ కేవలం 3 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ కాగా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా.. ఇంటి దారి పట్టింది.
Also Read: Allu Family – NKR: నితీష్ కుమార్ తో అల్లు అర్జున్ ఫ్యామిలీ..మీరు రెడ్డి మేము రెడ్డినే
Rohit Sharma took review when Time was UP, Umpires Indians 🤡
Open Fixing This Is 🙏🏻pic.twitter.com/ilQ3CYbeRd
— Popa 🇮🇳 (@MagnesiumKohli) May 1, 2025