Rizwan Babar Dropped: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో…. అట్టర్ ఫ్లాప్ అయిన పాకిస్తాన్ జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును స్వదేశంలో నిర్వహించినప్పటికీ… పాకిస్తాన్ మాత్రం.. ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఇంటి దారి పట్టింది. లోకల్ టీంగా అవకాశాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆడలేదు పాకిస్తాన్ ఆటగాళ్లు. అయితే చాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగిన పాకిస్తాన్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా… పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ కూడా ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ టి20 కెప్టెన్ .. మహమ్మద్ రిజ్వాన్ కు ( Mohammed Rizwan ) ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది.
Also Read: Rohit Sharma – Virat: నీకు కళ్ళు దొబ్బాయా..? కుల్దీప్ ను బండబూతులు తిట్టిన కోహ్లీ, రోహిత్ !
మహమ్మద్ రిజ్వాన్ ను పక్కకు పెట్టి.. సల్మాన్ అలీ అఘా కు అవకాశం ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. త్వరలోనే న్యూజిలాండ్ జట్టుతో ఐదు టి20 సిరీస్ ఆడబోతుంది పాకిస్తాన్ టీం. ఈ నేపథ్యంలోనే… జట్టులో నుంచి బాబర్ అజం, అలాగే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ను తొలగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కొత్త కెప్టెన్ గా సల్మాన్ అలీ కి ఛాన్స్ ఇచ్చి… మిగతా జట్టును ప్రకటించింది. అయితే వన్డే సిరీస్ కూడా న్యూజిలాండ్తో ఆడబోతుంది పాకిస్తాన్. అందులో మాత్రం… రిజ్వాన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వన్డేల్లో రిజ్వాన్ పై ( Mohammed Rizwan ) వేటు వేయలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అంటే ఇకపై మళ్లీ వన్డేలకు రిజ్వాన్ కెప్టెన్ గానే కొనసాగనున్నాడు. ఈ మేరకు టి20 అలాగే వన్డే జట్టను కూడా ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే టి20 జట్టులో రిజ్వాన్ తో పాటు బాబర్ ఆజాం పేర్లు లేకపోవడం… అందరినీ షాక్ నకు గురిచేస్తోంది. మరి కెప్టెన్ మారిన తర్వాత అయినా… పాకిస్తాన్ తీరు మారుతుందో…. లేదా ఎప్పటిలాగే ఆడతారో చూడాలి. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో… గ్రూప్ స్టేజిలో ఆడిన అన్ని మ్యాచ్ లు ఓడిపోయింది పాకిస్తాన్. ముఖ్యంగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడానికి వాళ్లు జీర్ణించుకోవడం లేదు.
Also Read: IND VS AUS: బ్యాటింగ్ చేయనున్న ఆసీస్…4 గురు స్పిన్నర్లతో టీమిండియా దాడి ?
పాకిస్థాన్ జట్లు:
వన్డే: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా (K ), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ అజామ్ ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, ముహమ్మద్ వాసిం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా సుఫ్యా ముక్ తాహిర్.
టీ20: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (K), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అలీ, మహ్మద్ హారీస్, మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, షహీన్ ఉఫ్రిక్, సుఫ్ ఉఫ్రిక్, సుఫ్ ఉఫ్రిక్.
🚨 Pakistan announce ODI and T20I squads for New Zealand tour 🚨@SalmanAliAgha1 appointed 🇵🇰 T20I captain 🌟#NZvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/c8WWG6WDti
— Pakistan Cricket (@TheRealPCB) March 4, 2025