BigTV English
Advertisement

RCB – Evil Eye : టైటిల్ గెలవాలని RCB ఫ్యాన్ ప్లానింగ్… కారు మొత్తం నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి మరీ

RCB – Evil Eye : టైటిల్ గెలవాలని RCB ఫ్యాన్ ప్లానింగ్… కారు మొత్తం నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి మరీ

RCB – Evil Eye : ఐపీఎల్ సీజన్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. పంజాబ్ కింగ్స్ జట్లు ఫైనల్ కి వెళ్లాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరిగే మ్యాచ్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. హోరా హోరీగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో కొత్త జట్టు టైటిల్ కొట్టబోతుంది. ఇరు జట్ల అభిమానులు తమ జట్టే ఫైనల్ కి వెళ్లాలి.. తమ జట్టే ఫైనల్ కి వెళ్లాలని పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మూడు సార్లు ఫైనల్ కి వెళ్లిన జట్టు ఆర్సీబీ టైటిల్ సాధించకుండానే వెనుదిరిగింది. ఇక నాలుగో సారి ఫైనల్ కి వెళ్లి ఎలాగైనా ట్రోఫీ సాధించాలనే ధీమాలో ఉంది. ఇక ఆర్సీబీ అభిమానులు టైటిల్ గెలవాలని భారీ ప్లానింగ్ చేశారు. ఒక కారుకు మొత్తం నిమ్మకాయలు, మిరపకాయలు  కట్టారు. చూసిన వారికి  ఆ కారు కి ఏదో క్షుద్ర పూజలు చేశారు అనే ఫీలింగ్ కలగకుండా ఉండటం లేదు.


Also Read :  IPL 2025 Final: భారీ వర్షం.. ఫైనల్ మ్యాచ్ కు బ్రేక్.. రద్దు అయితే విజేత ఎవరు

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే  మూడు సార్లు ఫైనల్ కి వెళ్లి రన్నరప్ గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే పంజాబ్ కింగ్స్ కూడా 2014లో ఫైనల్ కి వెళ్లింది. కానీ ఆ మ్యాచ్ లో విజయం సాధించలేకపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని రెండు జట్లు చాలా కసితో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ అయితే క్వాలిఫయర్ 1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడిన సమయంలో ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ని సోషల్ మీడియాతో తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు. పలు సినిమాలకు సంబంధించిన పాటలను పెట్టి వీడియోలను వైరల్ చేస్తున్నారు.


ఐపీఎల్ 2025 ఫైన్ కి ప్లేయర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ హంగామా వీడియోలు ఎస్ఎంలో వైరల్ అవుతున్నాయి. తమ ఫేవరేట్ జట్టు కి దిష్టి తగలొద్దని నిమ్మకాయలు, దిష్టి సింబల్స్ తో కారును అలంకరించారు. ఇక ఈ కారును రోడ్ల పై తిప్పుతున్నారు. “ఈసాలా కప్ నమ్దే” యాంటీ నజర్ స్క్వాడ్, పవర్డ్ బై లెమన్ &మిర్చి అని బోర్డులు పెట్టారు. ఈ సారి ఆర్సీబీ కప్ గెలవకుండా ఏ శక్తి కూడా ఆపలేదని ఆర్సీబీ అభిమానులు ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఐపీఎల్ ఫైనల్ కి ముందు ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ తిరిగి జట్టుతో చేరారు. గర్ల్ ఫ్రెండ్ బిడ్డ కి జన్మనివ్వడంతో చూసేందుకు యూకే కి వెళ్లాడు. తిరిగి అహ్మదాబాద్ కి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించినప్పటికీ.. వర్షం వచ్చే సూచనలు లేనట్టు కనిపిస్తోంది. ఒకవేళ వర్షం అప్పటికప్పుడు మ్యాచ్ జరగకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. అప్పుడు మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ స్టేజీలో టాప్ లో నిలిచిన పంజాబ్ దే టైటిల్ అయ్యే అవకాశం ఉంటుంది.

 

 

Tags

Related News

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Gambhir-Shubman Gill: గిల్‌కు క్లాస్ పీకిన కోచ్ గంభీర్..నీకు సోకులు ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువే అంటూ !

Big Stories

×