BigTV English

Riyan Parag: వరుసగా 6 సిక్సర్లు… అనన్య, సారా అలీ ఖాన్ పై కోపంతో రెచ్చిపోయిన రియాన్ పరాగ్

Riyan Parag: వరుసగా 6 సిక్సర్లు… అనన్య, సారా అలీ ఖాన్ పై కోపంతో రెచ్చిపోయిన రియాన్ పరాగ్

Riyan Parag : ఐపీఎల్ సీజన్ లో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాలు సాధించక పోయిన పలు రికార్డులను నమోదు చేస్తోంది. ఆ జట్టు తరపున ఆటగాళ్లు రికార్డు సృష్టిస్తున్నారు. మొన్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేస్తే.. ఇవాళ కెప్టెన్ రియాన్ పరాగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు బాదడం విశేషం. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రియాన్ పరాగ్ ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ లో 6 సిక్సులు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. మొయిన్ అలీ వేసిన ఓవర్ లో వరుసగా 5 సిక్సులు బాదిన పరాగ్.. ఆ తరువాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో తాను ఫేస్ చేసిన బాల్ ను సిక్స్ గా మలిచి ఈ రికార్డు తన పేరిట రాసుకున్నాడు. 


Also Read : RCB Fans : అంబటి రాయుడిని ఉరికిచ్చి కొడుతాం…RCB నుంచి స్ట్రాంగ్ వార్నింగ్

గతంలో అనన్య పాండే అలాగే సారా అలీ ఖాన్ హాట్ ఫోటోలను గూగుల్ లో సెర్చ్ చేశాడు పరాగ్. ఇక  ఆ సమయంలో పరాగ్ పైన ట్రోలింగ్ జరిగింది. ఐపీఎల్ 2024 సమయంలో ఈ సంఘటన జరిగింది.ఆ సమయంలో పరాగ్ ను ఒక ఆట ఆడుకున్నారు సారా అలీ ఖాన్ అలాగే అనన్య పాండే ఫ్యాన్స్.  ఇక ఈ ఇద్దరు హీరోయిన్లు కేకేఆర్ కు సపోర్ట్ చేస్తారు. అందుకే ఇవాల్టి కేకేఆర్ మ్యాచ్లో.. పరాగ్ అద్భుతంగా ఆడాడు. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడంతో కేకేఆర్ అభిమానులు అంతా ఆశ్యర్యపోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో 45 బంతుల్లో 96 పరుగులు చేసి ఔట్ అయ్యాడు పరాగ్. దీంతో రాజస్థాన్ జట్టు 1 పరుగు తేడాతో ఓటమి పాలైంది. దాదాపు రాజస్థాన్ గెలుస్తుందని అంతా భావించారు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం ఒకే ఒక్క పరుగు చేయడంతో 1 పరుగులు తేడాతో విజయం సాధించింది ఆర్.ఆర్. జట్టు.


ఇక హోరా హోరీ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాదించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బాగానే ఆడినప్పటికీ చివరికీ వచ్చే సరికి చేతులు ఎత్తేసింది. ఇలా చాలా మ్యాచ్ ల్లో ఈ సీజన్ లో ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. కెప్టెన్ రియాన్ పరాగ్ 45 బంతుల్లో 95 పరుగులు చేసినా అతని పోరాటం వృధా అయింది. హిట్మేయర్ 29 పరుగులు కాస్త పర్వాలేదనిపించాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. వీరిలో కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, హసరంగ ముగ్గురు ఇలా వచ్చి అలా వెల్లిపోయారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, మొయిన్ అలీ 2, హర్షిత్ రాణా 2, వైభవ్ అరోరా 1 వికెట్ తీశారు. దీంతో ఈ సీజన్ లో కేకేఆర్ కి ఇది ఆరో విజయం వరించింది. 

Related News

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×