BigTV English

Hockey Player Varun Kumar : హాకీ ప్లేయర్ పై అత్యాచార ఆరోపణలు.. కేసు నమోదు

Hockey Player Varun Kumar : హాకీ ప్లేయర్ పై అత్యాచార ఆరోపణలు.. కేసు నమోదు

Hockey Player Varun Kumar : భారత హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్ (Hockey Player Varun Kumar)పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వరుణ్ కుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి బెంగళూరు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు.. పోలీసులు వరుణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు.


వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన ఒక యువతికి 2019లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్ పరిచయమయ్యాడు. అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలు. బెంగళూరులో హాకీ మ్యాచ్ లు ఉన్నప్పుడు అతను వచ్చేవాడని, ఆ సమయంలోనే తనను కలిసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. శారీరకంగా లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వరుణ్ కుమార్.. ప్రస్తుతం పంజాబ్ లోని జలంధర్ లో నివసిస్తున్నాడు. ఈ కేసులో అతడిని విచారించేందుకై కర్ణాటక పోలీసుల బృందం జలంధర్ వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా.. వరుణ్ కుమార్ హాకీ ఇండియా లీగ్ లో పంజాబ్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత హాకీజట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.


Tags

Related News

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Watch Video : ఈ బుడ్డోడు మాములోడు కాదు… బౌలింగ్ వేస్తూ మూతి పగలగొట్టాడు.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Ganesh Idol : RCB ట్రోఫీతో బొజ్జ గణేష్… మళ్లీ తొక్కి సలాట జరగడం గ్యారంటీ అంటూ ట్రోలింగ్ !

Big Stories

×