Jay Shah on Test Cricket: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 2025 టోర్నమెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్లో భాగంగా జరిగిన అన్ని టెస్టులకు ఫ్యాన్స్ విపరీతంగా వచ్చారు. ఒక్కో రోజు 80,000 వరకు… టీమిడియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లను వీక్షించడం జరిగింది. ఇలా టెస్టులకు… గ్రౌండ్ కు వచ్చి క్రికెట్ అభిమానులు చూడడం చాలా రోజుల తర్వాత జరిగింది. దీనిపై అందరూ షాక్ అవుతున్నారు.. అయితే ఇలా తరచూ పెద్ద జట్ల మధ్య మ్యాచులు నిర్వహించాలని.. కొత్తగా డిమాండ్ తెరపైకి వస్తోంది.
అంటే 2 టైర్ విధానాన్ని టెస్టులలో అనుసరించాలని.. సీనియర్ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న జై షా ఈ విధానం తీసుకురావడంపై ఫోకస్ చేశారట. ముఖ్యంగా టీమిండియా, ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ బోర్డులతో… ఈ టూ టైర్ విధానంపై చర్చించబోతున్నారట ఐసీసీ చైర్మన్ జై షా.
Also Read: Abhishek Bachchan ETPL: క్రికెట్ రంగంలోకి మరో స్టార్ హీరో.. కోట్లలో పెట్టుబడులు పెట్టి?
అయితే ఈ విధానంపై కొన్ని జట్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం వల్ల చిన్న జట్లకు.. అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అలాగే టీమ్ ఇండియా లాంటి జట్లు తక్కువ మ్యాచ్లు ఆడినప్పటికీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అర్హత సాధిస్తున్నాయని.. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్ల క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధానం ప్రకారం టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్టులన్నీ… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఎక్కువ టెస్టులు ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పెద్ద జట్లు ఒక్క సంవత్సరానికి… ఒకసారి మాత్రమే తలపడుతున్నాయి. అయితే అలా కాకుండా… మొదటి ఎడిషన్ లోనే ఈ పైన చెప్పిన పెద్ద జట్లు… ఒకదానిపై మరొకటి గతంలో కంటే ఎక్కువసార్లు మ్యాచ్లు ఆడాలి.
ఇక… రెండవ టైర్ లో మిగిలిన… జట్లు వెస్టిండీస్ జింబాబ్వే ఐర్లాండ్ అలాగే బంగ్లాదేశ్… వాళ్లలో వాళ్లు తలపడాల్సి ఉంటుంది. ఇక వాటిలో ఏ జట్లు బాగా ప్రదర్శన చేస్తాయో… అందులో ఒకటి లేదా రెండు జట్లకు మాత్రమే.. టైర్ వన్… విభాగంలో చోటు దక్కుతుంది. ఇక మిగిలిన జట్లకు ఛాన్స్ ఉండదు. ఇదే 2 టైర్ విధానం. అయితే 2016 నుంచి టెస్ట్ లో ఈ విధానం తీసుకురావడంపై చాలా జట్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Also Read: Champions Trophy 2025: జైశ్వాల్, శాంసన్ కు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే టీం ఇండియా జట్టు ఇదే?
ముఖ్యంగా చిన్న జట్ల బోర్డులు… దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అలాంటి రూల్స్ వస్తే తమ క్రికెట్ ఆదరణ తగ్గిపోతుందని… మ్యాచ్లు ఎవరు చూడరని… చిన్న జట్ల బోర్డులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీసీసీఐ పాలకమండలి అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఐసీసీ చైర్మన్ గా నేరుగా జై షా ( Jay Shah) ఉండడంతో…. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవచ్చు అని అంటున్నారు. అంటే త్వరలోనే 2 టైర్ ( tier 2 test ) విధానాన్ని టెస్టు లోకి తీసుకురావడం గ్యారంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.