Abhishek Bachchan ETPL: ఇటీవల చాలామంది సినీ ప్రముఖులు క్రీడారంగంపై ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. చాలామంది హీరో, హీరోయిన్లు సినిమాల ద్వారా వారు అందుకునే రెమ్యునరేషన్ ని వివిధ వెంచర్లలో పెట్టుబడిగా పెడుతుంటారు. అయితే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుండి స్టార్ నటులు, నటీమణులు క్రీడల్లో పెట్టుబడులు పెట్టడం బాగా పాపులర్ అయింది. షారుఖాన్, జుహీ చావ్లా కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లో పెట్టుబడులు పెట్టారు.
Also Read: Champions Trophy 2025: జైశ్వాల్, శాంసన్ కు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే టీం ఇండియా జట్టు ఇదే?
ఇక నటి ప్రీతీ జింటా పంజాబ్ కింగ్స్ ఎలెవన్, శిల్పా శెట్టి రాజస్థాన్ రాయల్స్ టీమ్ లలో పెట్టుబడులు పెట్టారు. ఇక ఇప్పటికే అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ కబడ్డీ జట్టులో, ఇండియన్ సూపర్ లీగ్ (ఫుట్ బాల్) లో పెట్టుబడులు పెట్టగా.. తాజాగా క్రికెట్ రంగంలో అడుగు పెట్టారు. ఇటీవలే యూరోపియన్ టి-20 ప్రీమియర్ లీగ్ (ETPL) ఐసీసీ ఆమోదం పొందింది. దీంతో ఈటీపిఎల్ ఈ ఏడాది లాంచ్ కానుంది. అయితే క్రీడా ప్రేమికుడైన అభిషేక్ బచ్చన్ యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్ సహా యజమానిగా వ్యవహరించనున్నాడు.
ఈ లీగ్ లో స్కాట్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్ దేశాలకు చెందిన క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. ఆమ్ స్టర్ డామ్, రోట్టర్ డామ్, డబ్లిన్, బెల్ ఫాస్ట్, ఎడిన్ బర్గ్, గ్లాస్కో నగరాలకు చెందిన బ్రాంచ్ లు ఈ బరిలో ఉంటాయి. ఈ యూరోపియన్ టి-20 ప్రీమియర్ లీగ్ జూలై 15న ప్రారంభమై.. ఆగస్టు మూడో తేదీన ముగుస్తుంది. అయితే ఫ్రాంచైజీ పేర్లు, ఓనర్ల వివరాలు మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.
యూరోపియన్ టి-20 ప్రీమియర్ లీగ్ లో పెట్టుబడులు పెట్టిన సందర్భంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. ఈ లీగ్ మూడు దేశాల ( నెదర్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్) క్రికెట్ బోర్డుల సహకారంతో ముందుకు వస్తుందన్నాడు. ఈ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతుంది.
Also Read: Champions Trophy 2025: వైస్ కెప్టెన్ గా బుమ్రా.. మరి రోహిత్ పరిస్థితి?
కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకు అభిషేక్ హాజరు కాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ రూమర్స్ నేపథ్యంలో తాజాగా తన సతీమణి ఐశ్వర్యారాయ్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అభిషేక్. కుటుంబం విషయంలో ఆమె తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తుందని పేర్కొన్నారు. ఐశ్వర్య వల్లే తాను సినిమాలపై దృష్టి పెట్టగలుగుతున్నానని.. ఐశ్వర్య మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుందని తెలిపారు. అభిషేక్ చేసిన ఈ కామెంట్స్ తో వారి విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అయింది.
🚨 A GAME CHANGER IN EUROPEAN CRICKET 🚨
– Abhishek Bachchan invests in the ICC Sanctioned European T20 Premier League as Co Owner.
ETPL set to start on July 15th to August 3rd, 2025, players from Ireland, Scotland & Netherlands. pic.twitter.com/QF3SdiKttD
— Johns. (@CricCrazyJohns) January 6, 2025