Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) నేపథ్యంలో టీమిండియా అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందింది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియా ( Team India) ఆడే ప్రతి మ్యాచ్ కు అదనంగా ఎక్కువ టికెట్లు అందుబాటులోకి రాబోతున్నాయట. ఈ నేపథ్యంలోనే… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా దుబాయ్ వేదికగా ( Dubai )… టీమిండియా మ్యాచులు జరగనున్నాయి. అయితే గ్రూప్ దశలో టీమిండియా ఆడే మ్యాచ్ లతో పాటు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లకు అదనంగా టికెట్లు ఇచ్చేందుకు… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ) నిర్ణయం తీసుకుంది.
Also Read: IPL Teams Social Media Followers: ఇంకో 100 ఏళ్ళు CSK ను టచ్ చేసే దమ్ము ఎవడికి లేదు ?
దీంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి టికెట్లు ( Champions Trophy 2025 Tickets) వచ్చాయి. బుక్ చేసుకునే వాళ్ళు వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అధికారిక ప్రకటన కూడా రిలీజ్ అయింది. ఈ తరుణంలో టీమిండియా అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆన్లైన్ లోకి వెళ్లి… టీమిండియా మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను కూడా బుక్ చేసుకుంటున్నారు. ఈసారి హైబ్రిడ్ విధానంలో ఛాంపియన్ ట్రోఫీ 2025 జరుగుతున్న నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ టికెట్లు.. ఇంకా రిలీజ్ చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో టీమిండియా గనక ఫైనల్ కు చేరితే… దుబాయ్ వేదికగా మ్యాచ్… జరుగుతుంది. ఒకవేళ టీమిండియా టోర్నమెంట్ నుంచి వైదొలిగితే… ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్లోని లాహోర్ వేదికగా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC ) ప్రకటన కూడా చేసింది.
ఇది ఇలా ఉండగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మరో మూడు రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. హైబ్రిడ్ మోడల్ లో… ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. టీమిండియా ఒత్తిడి మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా తలవంచాల్సి వచ్చింది. పాకిస్తాన్ కు రాబోమని… టీమిండియా తెగేసి చెప్పడంతో హైబ్రిడ్ మోడల్ కు… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టీం ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ దుబాయిలో జరగనుంది. ఒకవేళ టీమిండియా ఫైనల్ లేదా సెమీఫైనల్ కు చేరకపోతే పాకిస్తాన్ గడ్డపైన కీలక మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ ఫైనల్ లేదా సెమి ఫైనల్ కు టీం ఇండియా చేరితే… అప్పుడు… దుబాయ్ వేదికగా ఈ కీలక మ్యాచులు ఉంటాయి. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో.. నిన్న ఉదయమే దుబాయ్ వెళ్ళింది. అయితే దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20వ తేదీన టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 23వ తేదీన ఆదివారం రోజున పాకిస్తాన్ తో టీమిండియా తలపడుతుంది.
Also Read: ICC Champions Trophy: 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ..ఇంత గ్యాప్ రావాడానికి కారణాలు ఇవే ?
The ICC Champions Trophy 2025, Dubai games are set to bring incredible excitement and thrill!
Venue: Dubai International Stadium
Limited tickets still up for grabs for Bangladesh vs India – Thursday, 20 February, get yours NOW!
Tickets available here: https://t.co/ILfoibrQWz pic.twitter.com/kvl8DTx2h2— UAE Cricket Official (@EmiratesCricket) February 16, 2025