Tollywood heroine.. ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అలా వివాహం చేసుకుంటున్నారో లేదో.. ఇలా తల్లిదండ్రులు అవుతున్నారు. మరికొంతమంది వివాహం జరిగిన కొన్ని ఏళ్లకు తమ జీవితంలోకి కొత్త బంధాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న గాబ్రియెల్లా (Gabriella) కూడా అభిమానులకు శుభవార్త తెలిపింది. త్వరలో తాను తల్లిగా ప్రమోట్ కాబోతున్నాను అని చెప్పి బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవడంతో సినీ సెలెబ్రెటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Babu Mohan: విషమిచ్చి చంపాలని చూశారు – బాబు మోహన్..!
గాబ్రియెల్లా కెరియర్..
టాలీవుడ్ హీరోయిన్ గాబ్రియెల్లా విషయానికి వస్తే..’ సుందరి’ అనే సీరియల్ లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. ఇందులో సుందరీ దేవిగా తన అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ పాపులారిటీతోనే వెండితెరపై కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అలా రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘కబాలి’ సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేసింది . ఆ తర్వాత ఎన్ -4, కాంచన 3, కట్టుమారం వంటి సినిమాలలో నటించి, తన నటనతో ఆకట్టుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆకాష్ (Akash) అనే వ్యక్తితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది గాబ్రియెల్లా.
బేబీ షవర్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్..
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకునే ఈమె.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. తనకు సీమంతం జరిగిన ఫోటోలు, తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ‘బేబీ షవర్’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఇక దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. త్వరలో తల్లిదండ్రులుగా మారబోతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హీరోయిన్ మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా..
ఈమె హీరోయిన్ మాత్రమే కాదు బెస్ట్ డాన్సర్ గా కూడా పేరు దక్కించుకుంది. తమిళంలో వచ్చిన జోడి జూనియర్ సీజన్ వన్ లో తన అద్భుతమైన డాన్స్ తో మెప్పించి, విజేతగా నిలిచింది. ఇక తర్వాత తమిళ్ బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని ,తన క్యారెక్టర్ తో కూడా ఆడియన్స్ ను మెప్పించింది. 1998 డిసెంబర్ 18న జన్మించిన ఈమె.. 2009లోనే ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇకపోతే 2012లో ధనుష్, శృతిహాసన్ హీరోగా వచ్చిన 3 అనే సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే. ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు డాన్సర్ గా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు త్వరలోనే తల్లి కాబోతోంది అని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.