Rohit Sharma: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో టీమిండియా తన తొలి మ్యాచ్ ని ఆడేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 19 గురువారం రోజున దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో భారత్ తలపడబోతోంది. అయితే ఇరుజట్ల బలాబలాలు, గత రికార్డుల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో భారత జట్టు స్పష్టమైన ఫేవరెట్ గా కనిపిస్తోంది. అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంగిట పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
దుబాయ్ వేదికగా జరుగునున్న ఈ తొలి మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులను ఛేదించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ మరో పన్నెండు పరుగులు చేస్తే వన్డేలలో అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 222 ఇన్నింగ్స్ లలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తే రెండు ప్రపంచ కప్ లు, ఛాంపియన్ ట్రోఫీ సీజన్లలో బంగ్లాదేశ్ పై సెంచరీ నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు.
అలాగే ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో 50, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన పదవ బ్యాటర్ గా రోహిత్ శర్మ మరో ఘనత అందుకుంటాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధిస్తే.. భారత్ తరపున 100 అంతర్జాతీయ మ్యాచ్ లు గెలిచిన నాలుగవ కెప్టెన్ గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 14 సిక్సర్లు బాధితే.. వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా అగ్రస్థానంలో నిలుస్తాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ ఆటగాడు 351 సిక్సులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
మరోవైపు రోహిత్ శర్మ కి దుబాయిలో చాలా మంచి రికార్డులు కూడా ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రోహిత్ శర్మ 105.66 సగటుతో 317 పరుగులు చేశాడు. ఈ మైదానంలో రోహిత్ శర్మ బ్యాట్ 25 ఫోర్లు, 13 సిక్సులు కొట్టింది. దుబాయిలో రోహిత్ శర్మ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే దుబాయ్ పిచ్చిపై రోహిత్ గత నాలుగు ఇన్నింగ్స్ లలో 50 కి పైగా సగటుతో పరుగులు చేశాడు. అలాగే ఆసియా కప్ లోనే పాకిస్తాన్ పై 111 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు. ప్రతి ఐసీసీ టైటిల్ కూడా మాకు ముఖ్యమైనదేనని.. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇక్కడికి వచ్చామన్నాడు. ప్రస్తుతం తమ అదృష్టంతా బంగ్లాదేశ్ మ్యాచ్ పైనే ఉందని.. ఈ మెగా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నామన్నాడు.
అయితే ఈ విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కెమెరా ముందు చాలాసార్లు దగ్గుతూ అస్వస్థతకు గురయ్యాడు. అయినప్పటికీ ప్రశాంతంగా ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు. అయితే సమావేశం మధ్యలో స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు రోహిత్ శర్మకి నీటిని అందించగా.. పరవాలేదు.. నేను బాగున్నాను అని తిరస్కరించాడు. దీంతో రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ లో ఉన్నాడా..? బంగ్లాదేశ్ తో ఛాంపియన్స్ ట్రోఫీలోని తొలి మ్యాచ్ ఆడతాడా..? అనే అంశంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Break🚨 Rohit Sharma mild Cough will be checked up by Medical Team Tomorrow morning according to UAE time and then final call will be taken whether he is fit to play or not as of now he will
— @imsajal (@sajalsinha4) February 19, 2025