Mahesh Kumar On KCR: బీఆర్ఎస్ పనైపోయిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. మాజీ సీఎం కేసీఆర్ పగటి కలలు కనడం అలవాటుగా మారిందన్నారు. ఆయన పర్మినెంట్‌గా రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆదరించాలని తాము అనుకోవడం లేదన్నారు.
నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఫామ్ హౌస్‌లో పడుకునే కేసీఆర్‌కు- అభివృద్ధిని పరుగులు పెట్టించే రేవంత్‌కు పోలికా? అంటూ సెటైర్లు వేశారు. రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్నారు. ఉద్యమ నేతగా ఆయనకు గౌరవిస్తామన్నారు.
పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే సత్తా లేని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫామ్ హౌస్‌లో పెన్ను పేపర్‌తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా? ప్రశ్నలు రైజ్ చేశారు. రాష్ర్టంలో56 శాతం బీసీలు మా వెంట ఉంటే గ్రాఫ్ ఎలా పడిపోతుందన్నారు. ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇకనైనా కేసీఆర్, బీఆర్ఎస్ పగటి కలలు మానుకోవాలని హితవు పలికారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండని, ఉంటే తండ్రి-కొడుకులు మాత్రమే ఉంటారన్నారు. కవిత, హరీష్‌రావు దిక్కులు చూస్తున్నారని, ఈ విషయం అందరికీ తెలుసన్నారు. ముస్లిం పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో అన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎనిమిదినెలల్లో 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఉంటామన్నారు.
ALSO READ: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.