BigTV English

Karnataka Tour IRCTC Package: వేసవి సెలవుల్లో కర్ణాటక చుట్టేయండి.. హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సిటిసి ఆఫర్!

Karnataka Tour IRCTC Package: వేసవి సెలవుల్లో కర్ణాటక చుట్టేయండి.. హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సిటిసి ఆఫర్!

Karnataka Tour IRCTC Package| కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్తగా “డివైన్ కర్ణాటక” పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా కర్ణాటకలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను, అందమైన పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. మొత్తం 5 రాత్రులు, 6 రోజులు (పగలు) సాగే ఈ టూర్‌లో గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, ధర్మస్థల, శృంగేరి, కుక్కే సుబ్రమణ్య వంటి ప్రసిద్ధ దైవ ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని ఐఆర్‌సిటిసి కల్పిస్తోంది.


టూర్ పూర్తి వివరాలు:

మొదటి రోజు:
ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఇండిగో ఫ్లైట్ (6E 7549) లో బయలుదేరి 8:00 గంటలకు (రెండు గంటలు ప్రయాణం) మంగుళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఎయిర్‌పోర్ట్‌లో అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని హోటల్‌కు వెళ్లి చెకిన్ చేశాక బ్రేక్‌ఫాస్ట్ అందుబాటులో ఉంటుంది.
ఆ తర్వాత మంగళదేవి ఆలయం, కద్రి మంజునాథ దేవాలయాన్ని సందర్శనకు వెళ్లాలి.
సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ క్షేత్రాన్ని దర్శించుకోవాలి.
రాత్రి డిన్నర్ అనంతరం మంగుళూరు హోటల్ లోనే బస చేయాలి.

రెండో రోజు:
ఉదయం టిఫిన్‌ అనంతరం ఉడిపికి బయలుదేరాలి.
ఉడిపిలోని హోటల్‌ చెకిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం సెయింట్ మేరీ ఐలాండ్, మల్పే బీచ్ సందర్శనకు బయలు దేరాలి.
సాయంత్రం ఉడిపి శ్రీకృష్ణ ఆలయం దర్శించుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.


Also Read: ఇక రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీ.. కొత్త సిస్టం ప్రవేశ పెట్టిన భారతీయ రైల్వే

మూడో రోజు:

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోరనాడుకు ప్రయాణం.
అక్కడ అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని దర్శించుకుని శృంగేరికి వెళ్లాలి.
శృంగేరి శారదాంబ ఆలయ సందర్శన అనంతరం తిరిగి ఉడిపికి చేరుకుని అక్కడే రాత్రికి బస.

నాలుగో రోజు:
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గోకర్ణ బయలుదేరుతారు
గోకర్ణలోని ప్రసిద్ధ దేవాలయాలను, బీచ్ సందర్శించి మురుడేశ్వర్‌కు ప్రయాణిస్తారు
మురుడేశ్వర్ ఆలయం సందర్శన అనంతరం తిరిగి ఉడిపికి చేరుకుని అక్కడ బస చేస్తారు

ఐదో రోజు:
బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ధర్మస్థల వెళ్లి మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు
తర్వాత కుక్కే సుబ్రమణ్య వెళ్లి అక్కడ హోటల్‌లో చెకిన్ అవుతారు
ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు

ఆరో రోజు:
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుని మంగుళూరు చేరుకుంటారు
మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని సాయంత్రం 4:20 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది
రాత్రి 7:00 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని టూర్ ముగుస్తుంది

టూర్ ధర వివరాలు:
సింగిల్ ఆక్యుపెన్సీ – ₹43,550
డబుల్ ఆక్యుపెన్సీ – ₹34,850
ట్రిపుల్ ఆక్యుపెన్సీ – ₹33,500

5-11 సంవత్సరాల పిల్లల కోసం:
విత్ బెడ్: ₹29,400
విత్ అవుట్ బెడ్: ₹26,900

2-4 సంవత్సరాల పిల్లల కోసం:

విత్ అవుట్ బెడ్: ₹20,650

 

టూర్ ప్యాకేజీలో ఉండే సౌకర్యాలు:

  •  విమాన టికెట్లు (హైదరాబాద్ ↔ మంగుళూరు)
  • హోటల్ వసతి
  •  6 బ్రేక్‌ఫాస్ట్‌లు, 4 డిన్నర్‌లు
  •  సైట్‌సీయింగ్ కోసం ప్రత్యేక వాహన సౌకర్యం
  •  ట్రావెల్ ఇన్సూరెన్స్

టూర్ బుకింగ్ & తేదీలు:
ప్రస్తుతానికి ఈ ప్యాకేజీ మార్చి 3, 2025 నుంచి అందుబాటులో ఉంటుంది.
టూర్ బుకింగ్ & ఇతర పూర్తి వివరాలకు లింక్ పై క్లిక్ (డివైన్ కర్ణాటక) చేయండి

Related News

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Big Stories

×