Champions Trophy 2025: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి నెల నుండి ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. అయితే ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించి.. మొదటి రౌండ్ లో ఆయా గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్ లు నిర్వహించనున్నారు. గ్రూప్ ఏ జాబితాలో పాకిస్తాన్, న్యూజిలాండ్, భారత్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడనున్నాయని సమాచారం.
Also Read: MS Dhoni: ధోని క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!
ఇక గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రూపురేఖలు సిద్ధం చేస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేయబోతుంది. ఇక ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్ లో నిర్వహించబోతున్నారన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించినందున బీసీసీఐ తన మ్యాచ్ లను తటస్థ వేదికలలో నిర్వహించాలని ఐసీసీ అభ్యర్థించింది.
హైబ్రిడ్ మోడల్ కి పాకిస్తాన్ ఓకే చెప్పినప్పటికీ.. ఈ తటస్థ వేదిక ఏది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీంతో భారత్ మ్యాచ్ లని ఎక్కడ నిర్వహిస్తారు అనేది క్లారిటీ రాలేదు. అయితే భారత్ ఆడే మ్యాచ్ లని దుబాయిలో నిర్వహిస్తారని క్రికెట్ వర్గాలలో జోరుగా వినిపిస్తుంది. ఫిబ్రవరి 23న భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోందని.. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టు దుబాయ్ కి రావాల్సిందేనట. ఈ తటస్థ వేదికగా దుబాయ్ ని ఎంచుకుంటారా..? లేక కొలంబో లాంటి ఇతర దేశాల వైపు ఐసీసీ మొగ్గు చూపిస్తుందా..? అనేది వేచి చూడాలి.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ లీగ్ మ్యాచ్ తో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా పోరు మొదలు పెట్టబోతుందని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో చోటు సంపాదించుకునేందుకు పలువురు ఆటగాళ్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల భారత దేశ వాలి క్రికెట్ లో రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 కూడా ముగిసింది. ప్రస్తుతం లిస్ట్ ఏ అనగా.. 50-50 ఓవర్లతో విజయ్ హజారే ట్రోఫీ కూడా ప్రారంభమైంది. ఇందులో దేశవాలి క్రికెటర్లు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు సంపాదించవచ్చు.
ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారట. 2023 ఒంటె ప్రపంచ కప్ నుండి మహమ్మద్ షమీ ఆటకి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం షమీ దేశవాలి క్రికెట్ కి తిరిగి వచ్చినప్పటికీ.. టెస్ట్ టీం ఇండియాకు మాత్రం తిరిగి రాలేదు. అయితే ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో రాణించి టీమిండియాలో చోటు సంపాదించాలని భావిస్తున్నాడట. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఇటీవల సయ్యద్ ముస్తక్ అలీ టీ20 ట్రోఫీలో ముంబై జట్టు ని టైటిల్ కి తీసుకువెళ్లాడు.
Also Read: sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ
ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా పరుగుల వర్షం కురిపించి మళ్లీ భారత వన్డే జట్టులో చోటు సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఈ ఏడాది ప్రారంభం నుండి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను కూడా చాంపియన్ ట్రోఫీలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ లిస్టులో మరో ఆటగాడు రజత్ పటిదార్ కూడా ఉన్నాడు. మరి ఈ ఆటగాళ్లకి ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కుతుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి.