BigTV English

Champions Trophy semis: టీమిండియాకు కొత్త టెన్షన్..ఆస్ట్రేలియాతోనే ఫైట్…సెమీస్ వేదికలు, టైమింగ్స్ ఇవే ?

Champions Trophy semis: టీమిండియాకు కొత్త టెన్షన్..ఆస్ట్రేలియాతోనే ఫైట్…సెమీస్ వేదికలు, టైమింగ్స్ ఇవే ?

Champions Trophy semis: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025  ) సెమీ ఫైనల్ మ్యాచ్లు ఏ జట్ల మధ్య జరుగుతాయో… క్లారిటీ వచ్చేసింది. న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసిన టీమిండియా… తన తొలి సెమీఫైనల్ కంగారులతో ఆడబోతుంది. అందరూ భయపడినట్లుగానే… మరోసారి ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ లో టీమిండియా తలపడనుంది. ఇక అటు న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా  ( New Zealand vs South Africa )
మధ్య… రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.


Also Read: Wpl 2025: టోర్నమెంట్ నుంచి RCB ఔట్…. సెమిస్ వెళ్లే జట్లు ఇవే.. ఇదిగో లెక్కలు?

ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia )
మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్… దుబాయ్ వేదికగా మార్చి నాలుగో తేదీన అంటే మంగళవారం జరగనుంది. మార్చి 4వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు…. ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి సెమీఫైనల్ ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్న తరుణంలో… టీమిండియా ఏ మ్యాచ్ అయినా దుబాయ్ లోనే ఆడాలి.


అయితే రెండవ సెమీఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్… పాకిస్తాన్లోని లాహోర్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం… మధ్యాహ్నం రెండున్నర గంటలకు… మార్చి 5వ తేదీన జరగబోతుంది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటుకు… పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినందున… ఈ పరిస్థితి నెలకొంది. అయితే… ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచి ఫైనల్ కి వెళ్తే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్ లో జరుగుతుంది. అలా కాదు అని సెమీఫైనల్ లో టీమిండియా ఓడిపోయి ఇంటికి వెళితే… పాకిస్తాన్ లోని లాహోర్ వేదికగా ఛాంపియన్ టోపీ 2025 టోర్నమెంట్ ఫైనల్ జరగనుంది.

Also Read: Nz vs Ind: ఫిలిప్స్ క్యాచ్ అదుర్స్..షాక్ లో అనుష్క శర్మ కోహ్లీ.. కష్టాల్లో టీమిండియా?

సెమీస్ మ్యాచ్ లు ఎలా ఉచితంగా చూడాలి ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో ( Champions Trophy 2025 semis ) భాగంగా జరిగే రెండు సెమి ఫైనల్ మ్యాచ్ లు జియో హాట్ స్టార్ వేదికగా ఉచితంగా చూడవచ్చు. ఈ మ్యాచ్ లు జియో సిమ్ ఉన్నవారు ఉచితంగా చూడవచ్చు. అలాగే… స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 ఛానల్ లో.. మ్యాచ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా.. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇవాళ చిట్ట చివరి గ్రూప్ స్టేజి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అయితే అనూహ్యంగా… ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్ జట్టు పైన 44 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది టీమిండియా. బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ అలాగే హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ నడ్డి విరిచాడు.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×